Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

ధనుర్విద్యావిలాసము


చాపాదిలక్షణజ్ఞానమస్త్రాణాం కరణం తథా।
అస్త్రమంత్రపరిజ్ఞానాధ్యాయో మదవినిర్గమః ॥
ఏవమాద్యా ధనుర్వేదే విద్యాః సంతి సహస్రశః ॥


అను నిరువదితొమ్మిది యంశములు విస్తరింపఁ బడియె. ధనుర్వే దసూత్రములు పరశురామకృతములై శాండిల్యభాష్య వివృతములై కేరళదేశమున లభించుచున్నవని తెలియుచున్నవి. అది నాలుగు పాదములుగలది. ప్రథమముదీక్షాపాదము. రెండవది సంగ్రహపాదము. మూడవది సిద్దిపాదము. నాల్గవది ప్రయోగపాదము. ధనుశ్శబ్దము సర్వ ప్రహరణముల వర్తించు. అది ముక్తాది చతుర్భేదకము. ముక్తమనగాఁ జక్ర, వజ్ర, వలయ, శక్తి, తోమర, కుంత, పాషాణాదికము. అముక్తమనగా నంకుశ, పాశ, క్షురికా, అసి, గదా, ముసల, దండాదికము. ముక్తాముక్తమనఁ బాశ, వాగురా, రజ్జు వలయాదికము. యంత్రముక్త మనఁ జాప, శతఘ్ని, శల్యక, మంజు, షార్క వర్ణాదికము. మన శాస్త్రానుసారముగా సర్వశస్త్రములలో ధనువు శ్రేష్ఠము. వింటియంగములు బాణము, అర్ధచంద్రము, శిలీముఖము, నారాచము, మోచకము మొదలగునవి. అస్త్రము మంత్రాక్షర ప్రతిలోమ పఠితమై యధిదేవత ప్రేరితమై యుండును. మంత్రదేవతాభేదముల ననుసరించి, బ్రాహ్మ్యము, ప్రాజాపత్యము, వైష్ణవము, శైవము, ఐంద్రము, వారుణము, ఆగ్నేయము, వాయవ్యము, సౌమ్యము (చంద్రదైవతకము), ఆదిత్యము, దౌర్గము (దుర్గాదైవతకము), గాణేశ్వరము (వినాయకాధి దైవతకము), స్కాందము, శాక్తేయము, యాక్షంరాక్షసము, నాగము, గారుడము, గాంధర్వము, పైశాచము, పైత్రము (పితృదైవతకము), పార్థివము, ఆప్యము (జలాధి దైవతకము), తైజసము, పావనము, నాభసము, (ఈకడపటి యైదును బంచభూతముల గ్రామముగా స్తంభింప జేయునట ) సాముద్రము, పార్వతము, గాయత్రము త్రైష్టుభమానుష్టుభము, మొదలగునవి (కడపటిమూడును ఛందోదైవతకము లగు మంత్రములు ప్రయోగములుగా గలవి) ఈ యాయుధశిక్ష కధికారులు క్షత్రియులును బ్రాహ్మణులును దదనుయాయులును నగుదురు. రథ గజ తురగ పదాతులె వాని కధికరణములు. ఈ సూత్రపాఠమునఁ బ్రథమపాదమున ధనుర్వేదాభ్యాసమునకు