Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

345

తచ్చధనుర్దీక్షాయాం పార్ధః ఉత్తమాధికారి. బాణాసురో, మధ్యమాధికారీ, సాత్యకి ప్రభృతయః సహస్రార్జునో హీనాధికారీ, గురవధాత్ ఇతిధనుర్ధర ప్రశంసా॥ అముద్రితములైన గ్రంథములు శ్రీమానవల్లి రామకృష్ణకవి ఎం.ఏ, గారి దగ్గఱనున్నవి. వానిని జూచియే నే నాయాభాగములు నుదాహరించితిని.

ఈ ధనుర్వేదమును గూర్చి శ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం.ఏ. గారిప్పటి కిర్వది యాఱేండ్లకు ముందు గొప్ప వ్యాసము ప్రకటించిరి. దానినెల్ల నిక్కడ మరలఁ బ్రకటించి దానిపై విశేషార్థములు వివరింతును.

"ధనుశ్శబ్దము వింటికి రూఢమైనను ముక్తము అముక్తము ముక్తాముక్తము యంత్రముక్తము అను చతుర్విధ ప్రహరణముల వర్తించుచు ధనుర్వేదము శత్రుదండరూపమగు సమస్త ప్రయోగ సామగ్రీ తత్త్వమును బ్రతిపాదించును. అది యిరువదివేల శ్లోకములతో నీశానసంహితయను పేరితో శివునిచేఁ బార్వతి కుపదేశింపఁబడియె.

అందు


వింశత్సహస్రమానస్తు ధనుర్వేదో౽పి కీర్తితః।
యస్మిన్ నిగద్యతే సర్వలోకతత్త్వం వరాననే॥
బలాపాదనకాధ్యాయః స్థానాధ్యాయః ప్రమర్దనమ్ ।
భౌతికాపాదనాధ్యాయః సంధివిక్షేపణం తథా॥
అక్రమోజ్జీవనోధ్యాయః శ్రమప్రాప్తేర్హి లక్షణమ్।
ఆయుధగ్రహణం శిక్షా క్రమస్తత్పరిశీలనమ్ ॥
సన్నాహస్థాన చలన మపసవ్యస్థితిక్రమః ।
ఆశ్లేషోవాంతరాలంబ హస్తాటన పటుక్రియా ॥
ముష్టి బంధస్థానబంధో ధృష్టతాపాదనం తథా ।
సంగ్రామవిద్యావిజ్ఞానం సర్వాయుధ విలంఘనమ్ ॥
సూత్రాధ్యాయః పరీక్షా చ పాదపాయూపఘట్టనమ్ ।
రథాశ్వేభాద్యవస్థాన లక్షణాధ్యాయ ఏవ చ॥
(విలుంటనం మోటనం చ భ్రమణం పరిశీలనమ్ ।
ఆయుర్‌జ్ఞానం మోహనం చ భిన్నముల్లాసితం తథా) ॥