338
అన్నమాచార్యచరిత్ర
ముల రాగిరేకు లన్నింటిని స్వాధీనముచేసికొంటిని. అస్మదీయుఁడు నాకుఁ జేదోడుగా ననువర్తించు పరిశోధన కార్యసహాయ విద్వాంసుఁడు చిరంజీవి. ఎ.వి. శ్రీనివాసాచార్యుఁడు వేలలెక్క నున్నరాగిరేకుల భరము మోయుచు బడలుచున్నను సంకీర్తనముల స్వారస్యా స్వాదనమున శ్రమతీర్చు కొనుచు సర్వపరిశోధన సందర్భములందు జాగరూకుఁడై తోడ్పడుచున్నాఁడు. మిత్రులైన డైరెక్టరు శ్రీపరవస్తు వెంకట రామానుజస్వామి, ఎం.ఏ. గారు నాకీ కార్య నిర్వాహములో సహాయపడుచున్నారు. దేవస్థానమునఁ బైముఖ్యాధికారులిందుకుఁ జాల ముచ్చట పడువారుగా నున్నారు. ఇంకఁజక్కగా తాళ్ళపాక సంకీర్తనములఁగొన్నింటిని సంగీతసాహిత్యపరిపుష్టులు శ్రీ అనంతకృష్ణశర్మగారు స్వరవిన్యాసముతోఁ బ్రకటించుచున్నారు. ఇట్లిన్నాళ్ళకుఁ దాళ్ళపాక మహనీయుల స్వామి సేవాఫలము పరిపక్వమై సహృదయాస్వాద్యమగుచున్నది. అన్నమాచార్యాదులారా ! ఆనందింపుడు! అయిదువందలేండ్లకుఁ బిదప మీయభీప్సితము లన్వర్థములు గావలసినట్లున్నది గాఁబోలును స్వామియనుగ్రహము !
సీ॥ చెక్కిళ్ళఁ జిఱునవ్వు చిందుద్రొక్కెడుఱేఁడ!
యేడుకొండలవాఁడ! యేలుకొమ్ము
అలమేలు మంగాంబ చెలికాఁడ ! యడుగడ్గు
దండాలవాఁడ ! మా కండ వగుము
ఆమటమ్రొక్కులస్వామి ! గోవింద గో
వింద సందడివేల్ప ! వందనమ్ము
కలియుగప్రత్యక్ష కులదైవమా ! యెల్ల
డెందాలవిహరించువింద ! శరణు
గీ॥ పిండివంటకములు కుండలవండిన
యోరెములును మాత్ర లారగించి
భక్తులకుఁ బ్రసాదపఱుచు మహాభోగి
వరకటాక్ష ! పరమపురుష! రక్ష |
సీ॥ నిలువుదోపుడు దోచు నెఱదొంగతన మేమి ?
పాపముల్ హరియించు భావ మొక్కొ
వడ్డికాసులఁ గూర్చు వ్యాపార మది యేమి ?