వేటూరి ప్రభాకరశాస్త్రి
327
వేంకటేశ్వరస్వామి బ్రహ్మప్రతిష్ఠితుఁడు గనుక, ఆప్రతిష్ఠ జరిగించిన బ్రహ్మపేర తిరుపతి వరోత్సములు బ్రహ్మోత్సములయ్యెననీ దాని ననుసరించ దక్షిణదేశపు దేవోత్సములకెల్ల బ్రహ్మోత్సవములని పేరు సంక్రమించెననీ ఆ యుత్సవములలో కళ్యాణము జరుపుట తెల్గుదేశమునఁ గ్రొత్తగాఁ గలిగిన యాచారమని శ్రీపరవస్తు రామానుజస్వామి ఎం.ఏ. గారు చెప్పుచున్నారు.
బ్రహ్మోత్సవము :-
అహిరి
నానాదిక్కుల నరు లెల్ల ।
వానల లోననె వత్తురు గదలి ॥పల్లవి॥
సతులు సుతులుఁ బరిసరులు బాంధవులు ।
హితులు గొలువఁగా నిందరును ।
శతసహస్ర యోజనవాసులు సు ।
వ్రతములతోడనె వత్తురు గదలి ॥నానా॥ 1
ముడుపులు జాళెలు మొగిఁ దలమూటలు ।
కడలేనిధనము గంతలును ।
కడుమంచిమణులు కరులు దురగములు ।
వడిగొని చెలఁగుచు వత్తురు గదలి ॥నానా॥ 2
మగుటవర్ధనులు మండలేశ్వరులు ।
జగదేక పతులుఁ జతురులును ।
తగు వేంకటపతి దర్శింపఁగ బహు ।
వగల సంపదల వత్తురు గదలి ॥నానా॥ 3
అన్న. అధ్యా. 331 ఱేకు.
అంపకాలు : -
ముఖారి
భోగీంద్రులును మీరుఁ బోయి రండు ।
వేగిన మీఁదటి విభవములకు ॥పల్లవి॥