320
అన్నమాచార్యచరిత్ర
జగతిపై హితముగాఁ జరియించువాఁడే ।
పగలేక మతిలోన బ్రతికినవాఁడు ।
తెగి సకలము నాత్మఁ దెలిసినవాఁడే ।
తగిలి వేంకటేశు దాసుఁడయినవాఁడు ॥ఏకుల॥ 3
అన్న. అధ్యా. 47 ఱేకు.
లలిత
విజాతు లన్నియు వృథావృథా ।
అజామిళాదుల కది యేజాతి ॥పల్లవి॥
జాతిభేదములు శరీరగుణములు ।
జాతిశరీరము సరిఁ దోడనె చెడు ।
ఆతుమ పరిశుద్ధం బెప్పుడును అది నిర్దోషం బనాది ।
యీతల హరివిజ్ఞానపు దాస్యం బిదియొక్కటైపో సుజాతి ॥విజా॥ 1
హరి యిందరిలో నంతరాత్ముఁడి దె ।
ధరణి జాతిభేదము లెంచిన ।
పరమయోగు లీభావ మష్టమదము భవనికారమని మానిరి ।
ధరణిలోనఁ బరతత్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి ॥విజా॥ 2
లౌకికవైదిక లంపటులకు నివి ।
కైకొనునవశ్య కర్తవ్యంబులు ।
శ్రీకాంతుఁడు శ్రీ వేంకటపతి సేసిన సంపాదనమిందఱికి ।
మేకొని యిన్నియు మీఱినహరికి మీనామమే సుజాతి ॥విజా॥ 3
అన్న. అధ్యా. 177 ఱేకు.
నాదనామక్రియ
ప్రపన్నులకు నిది పరమాచారము ।
విపరీతాచారము విడువఁగ వలయు ॥పల్లవి॥
భగవదపచారము భాగవతాపచారముఁ
దగులక దేవతాంతరము మాని ।
నగధరు శరణము నమ్మి యాచార్యుని ।
బగి వాయనిదే పరమవైష్ణవము ॥ప్రప॥ 1