314
అన్నమాచార్యచరిత్ర
గంపెఁడుముక దినఁగా నొక్కవరిగింజ ।
తెంపునఁ గలసితే తెలియనెట్టువచ్చు ।
జంపులం బలవరించఁగ నొకమంచిమాట ।
ఇంపైతె హరి యందు కిచ్చునా వరము ॥వెఱ్ఱు॥ 2
ఉమిసినతమ్మలో నొకకొంత కప్రము ।
సమకూర్చి చవిగొని చప్పరించనేల ।
అమరంగ ఛాయాపహారము చేసుక।
తమమాట గూర్చితే దైవము నగఁడా ॥వెఱ్ఱు॥ 3
చిబికి వేసినగింజ చేతఁ బట్టఁగనేల ।
గబుక కెంగిలిబూరె గడుగంగ మఱియేల ।
తొబుక కవిత్వాల దోషాలఁ బొరలితే ।
దిబుకార నవ్వడా దేవుఁ డైనాను ॥వెఱ్ఱు॥ 4
మించు చద్దికూటిమీఁద నుమిసినట్టు ।
మంచి దొకటి చెప్పి మఱి చెప్పనేరక ।
కంచుఁ బెంచు నొక్కగతి నదికితే మట్టి ।
పెంచువలెనే చూచుఁ బెరుమాళ్ళు వాని ॥వెఱ్ఱు॥ 5
పుచ్చినట్టిపండు బూఁజిలోననెవుండు
బచ్చనకవితలు బాఁతిగావు యెందు ।
ముచ్చుఁ గన్నతల్లి మూల కొదిఁగినట్లు ।
మ్రుచ్చిమి నుతు లేల మ్రొక్కరో హరికి ॥వెఱ్ఱు॥ 6
ఉల్లిదిన్నకోమ టూరక ఉన్నట్లు
జల్లెడ నావాలు జాఱిపోయినట్టు ।
కల్లలు చెప్పి యాకత కుత్తరములీక ।
మెల్లనే ఉండితే మెచ్చునా దైవము ॥వెఱ్ఱు॥ 7
నేతిబీఱకాయ నేయి అందు లేదు ।
రాతివీరునికి బీరము ఇంచుకా లేదు ।