వేటూరి ప్రభాకరశాస్త్రి
313
సమానముగాఁ దటస్థించినవి. అన్నమాచార్యుని శృంగారసంకీర్తనరచనాంశము క్షేత్రయ్యగాను అధ్యాత్మసంకీర్తనరచనాంశము త్యాగయ్యగాను నవతారముదాల్చెననఁజెల్లును. అన్నమాచార్యునట్లు సంకెళ్ళువేసి చెరలోనుంచుట స్వామికృపవలన నాక్లేశము తొలఁగిపోవుట రామదాసు గారికిని గలిగెను.
అన్నమాచార్యుని పలుకుబళ్ళు
అన్నమాచార్యుని సంకీర్తనములభాష పశ్చిమాంధ్ర దేశమున వాడుక గన్నది. ఆతనిపలుకుబళ్ళు చాలా కృష్ణరాయలయుఁ దదాస్థాన కవులయు రచనలలోని కెక్కినవి. రాయలతోఁ దఱచుగాఁ దిరుపతికి వచ్చి స్వామి సన్నిధికి తాళ్ళపాకవారి సంకీర్తనముల వినుచుండుటచే నాయాకవులకు వీరి పలుకుబళ్లు సుపరిచితములయి యుండవచ్చును. మచ్చుకుఁ గొన్ని :-
చిగురుఁగొమ్మైనఁ జేవ, మీసాలపై తేనియల్, సందుసుడిమాయలు, తంగేటిజున్ను, నూతులుత్రవ్వితే బేతాళాలుబయల్పడును, కోలగగ్గెర, పొరివిడంగాయములు, గోవాళ్లు, చిందువందు, తలపూవాడక.
తాళ్ళపాకవారి సంకీర్తనముల ఛాయలు వేమన పద్యములలోని కెక్కినవి.
ఛాయాపహారులు
తన సంకీర్తనచ్చాయాపహారులను - వా రెవరో పేరు తెలియదు అన్నమయ కటువుగా గర్హించెను.
రామక్రియ
వెఱ్ఱులాల మీకు వేడుక కలితేను ।
అఱ్ఱువంచి తడు కల్లంగరాదా ॥పల్లవి॥
ముడిచి వేసినపువ్వు ముడువ యోగ్యముగాదు ।
కుడిచివేసినపుల్లె కుడువఁగాఁ గాదు ।
బడి నొకరు చెప్పినఁ బ్రతిచెప్పఁ బోతేను ।
అడరి శ్రీహరికి నది అరుహము గాదు ॥వెఱ్ఱు॥ 1