Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

అన్నమాచార్యచరిత్ర


కీర్తించిన వేల్పులు

అన్నమాచార్యుఁడును ఆయనకొడుకు పెదతిరుమలాచార్యుఁడును మనుమఁడు చినతిరుమలాచార్యులును నీక్రిందిపుణ్యస్థలములలోని దేవతలఁ బేర్కొని సంకీర్తనములు చాల రచించిరి. మాడుపూరికేశవుఁడు కృష్ణుఁడు, దాసరిపల్లె రాముఁడు, మండెము నృసింహుఁడు, కదిరి నృసింహుడు, కదిరి వసంతుఁడు, చెంజినవనీతకృష్ణుఁడు, కళసాహనుమంతుఁడు, అహోబల నృసింహుడు, విజయనగరవేంకటేశ్వర విట్ఠల నరసింహహనుమంతులు, కడప వెంకటేశ్వరుఁడు, తిరుపలాచ్చివిష్ణుఁడు, తిరువళ్ళూరి వీరరాఘవుఁడు, కంచి వరదరాజు గండవరముగోపాలుఁడు, కుఱునూతుల చెన్నుఁడు, చేగలమఱ్ఱి చెన్నుఁడు, వావిలిపాడు రాముఁడు, ఉద్దగిరికృష్ణుఁడు, గుత్తిరాముఁడు, వెలుగోటి కేశవుఁడు, మంగాంబుధి హనుమంతుఁడు, నల్లబల్లి చెన్నుఁడు, ఊటుకూరి చెన్నకేశవుఁడు, కోవెలగుంట్లగోపాలకృష్ణుడు, ఓగునూతులనృసింహుఁడు, కోనచెన్నరాయఁడు, శ్రీరంగమురంగనాథస్వామి, ఒంటిమెట్ట వీరరఘురాముఁడు, చుక్కపల్లి చెన్నుఁడు, కోసువానిపల్లె, చెళ్లపిళ్ళ,, నెల్లూరు - అధ్యాత్మ సంకీర్తనములలో చదివిచూచి నంతలోఁ గానవచ్చిన నివి. కడముట్ట బరిశీలించినపై నింక నెన్నియగునో !

సంకీర్తనముద్రాసామ్యములు

తాళ్ళపాక అన్నయ తిరుమలాచార్యులకు నిన్నూఱువర్షములఁ దర్వాత కాలమున క్రీ 1650 ప్రాంతముల వర్తిల్లిన క్షేత్రయ్యయును క్షేత్రయ్య కించు మించుగా నిన్నూఱేండ్లతర్వాత వర్తిల్లిన త్యాగరాయలవారును నిట్లే యనేక దివ్యస్థలముల దేవతలపై సంకీర్తనముల రచించిరి. తాళ్ళపాకవారాయాదేవలకుఁ దిరుపతి వేంకటేశ్వరునితో నభేదము గల్పించి వేంకటేశ్వరనామ ముద్ర యుంచినట్లు క్షేత్రయయు నాయాక్షేత్రములదేవతలకు మువ్వగోపాలునితో నభేదము గల్పించి మువ్వగోపాల ముద్రను సంకీర్తనములకుఁ గూర్చెను. త్యాగరాయలవా రాయాక్షేత్రముల దేవతలఁ బేర్కొనుచుఁ గడపటి చరణమునఁ దనపేరే ముద్రగా వెలయించిరి.

రాజస్తుతిపరాఙ్ముఖత్వము, దేవతార్చనవిగ్రహములను గోల్పోవుట, మొదలగు విషయములు కొన్ని యన్నమాచార్యునకును, త్యాగరాజునకును