Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

అన్నమాచార్యచరిత్ర

ఆతనితండ్రియు క్రీ. 1453 దాఁక వర్తిల్లినవాఁడునగు పెదతిరుమలాచార్యుని, ఆతని యన్నయగు నరసింగన్నను మెచ్చినాఁడు.

ద్విపదమునకుఁ జిన్నన్న వ్రాలును. పదములకుఁ బెదతిరుమలయ్య వ్రాలును. పద్య గద్య (ని) శ్రేణిని నరసింగన్న మిన్నందిమ్రోఁగును! అని దీని యర్థమనుకొందును. నరసింగన్న యిందధికముగాఁ బ్రస్తుతుఁడయ్యెను. కాని యాతఁడు రచించిన గ్రంథము లేవో తెలియరావు. 'పాడఁజెప్పఁగ వర్ణపద్ధతి నీడు । జోడు లేఁడన సభఁజొచ్చి వాదించి । పరగినధీశాలి ప్రతివాది దైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు,' అని చిన్నన్న యష్టమహిషీకళ్యాణమున నాతని స్తుతించెను. అతని కుటుంబ వృద్ధినిగూడ వివరించెను. చిన్నన్న పేర్కొనుటే కాని దేవస్థానశాసనములోఁగాని, తాళ్ళపాక వారియిండ్లలోఁగాని, లోకమునఁగాని యాతని విషయ మేదియు గానరాకున్నది. చిన్నన్నయే క్రీ 1546 కొండవీటిసీమలోని చెందలూరు మల్లవర గ్రామములను స్వామికైంకర్యములకై సమర్పించుచునందు మాఘశుద్ధ చతుర్థీతిథిని తన పెదతండ్రిగారయిన నరసయ్యంగారి ప్రత్యాబ్దిక దినమున నర్చనావిశేషముల నిర్వహణముకూడఁ జేర్చినాఁడు. [1]ఇది క్రీ. 1546 నాఁటికి నరసింగన్న దివ్య ధామముఁబడయుటను జిన్నన్న కాతనిపై గౌరవమును దెలుపుచున్నది.

శ్రీ వీరేశలింగము పంతులుగారు కవిచరిత్రమున కవికర్ణరసాయనకర్త కృష్ణదేవరాయలనాఁటి వాఁడని కృష్ణరాయని "ఆందోళికల యందునంతరచరులౌట సవికృతాకృతుల పిశాచజనులు.... ప్రభుదురాత్ములనెవ్వాఁడు ప్రస్తుతించు” ననిగర్హించెనని, వ్రాసినారు. వృద్ధానుశ్రుతినిబట్టి వ్రాసిన యీ వ్రాఁత విశ్వాస్యమే యనుకొందును. కవికర్ణరసాయనకర్త నరసింగన్న తాళ్ళపాక నరసింగన్న కాఁగూడు ననుకొందును. లక్షణగ్రంథములందు సుంకసాలనరసింగన్న అని కలదు. సంకుసాల అనిలోకమువాడుక. “సుంకేసుల” అని గ్రామములు రాయలసీమలో నున్నవి.


క॥ ఇంకా నవ్వే వచ్చే
     సుంకేసుల మ్రానిక్రింది సుద్దులు దలఁపన్

  1. తిరుపతి శాసనములు 5 వ్యాల్యుం. 184 పుట, చూ.