ఈ పుట అచ్చుదిద్దబడ్డది
284
అన్నమాచార్యచరిత్ర
మాళి రాగం
శరణు శరణు సురేంద్ర వందిత శరణు శ్రీపతిసేవిత ।
శరణు పార్వతితనయ మారుతి శరణు సిద్ధివినాయక ॥పల్లవి॥
నిటలనేత్రన దేవిసుతనె నాగభూషణప్రియనె ।
తటిల్లతాంకిత కోమలాంగనె కర్ణకుండల ధారనె ॥శర॥
బటువుముత్తిన పదకహారనె బాహు హస్తచరుష్కనె ।
ఇట్టితొడగియు హేమకంకణ పాశ అంకుశ ధారనె ॥శర॥
కుక్షియొళు మహాలంబోదరనె ఇక్షుచాప గెలిదనె ।
పక్షివాహన నాద పురందరవిట్ఠలన నిజదాసనె ॥శర॥
అన్నమాచార్యుల వారి సంకీర్తనచ్చాయనే పురందరదాసులవారి కీర్తన మున్నది.
సంకీర్తన సంఖ్య
అన్నమాచార్యుఁడు యోగవైరాగ్య శృంగార మార్గములలో ముప్పదిరెండువేల సంకీర్తనములఁ జెప్పెనని కలదు. (చూ. 45 పుట.) ఆతఁడు తన పదునాఱేండ్లవయసున నుపక్రమించి దివ్యధామ మందుదాఁక దినమున కొక సంకీర్తనము చొప్పున సంకీర్తనములు రచించినట్లున్నది. [1] అట్లు లెక్కింపగా నించుమించుగా నిర్వదిమూఁడువేల సంకీర్తనములు లెక్కకు వచ్చును. ఇందు ముప్పదిరెండువేల సంకీర్తనములు రచించినట్లున్నది. "పరమతంత్రమ్ములిర్వది రెండువేలు॥ అని యుండవలెనో, కానిచో, ఆ రాగిరేకు మీఁదివాక్యమునకుఁ బ్రతిదినము నొక్కదానికిఁ దక్కువ కానీక సంకీర్తనములు రచించుచుండెనని యర్థము చెప్పికొనవలెనో. రెండవ తీరనుకొందుమేని ముప్పది రెండువేల సంకీర్తనములు రచించెననుట సంగతమే. రచించిన యా సంకీర్తనములెల్ల రాగిరేకుల కెక్కనే లేదో? ఎక్కినను నిప్పుడు మనకు దొరకలేదో? తిరుపతి దేవస్థానమునఁ గాక అహోబలమునకుఁ గొన్ని రేకులు చేరియున్నట్లు- ↑ (చూ) అన్నమాచార్యుల శృంగార సంకీర్తనముల మొదటి ఱేకు అధ్యాత్మ సంకీర్తనముల మొదటి ఱేకు.