Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

281


అన్నమయ మహిమలు

మండెమురాయనామక నరసింహదండనేత్రు (తృ?)న కిష్టధనబలస్ఫూర్తినిత్యాదివాక్యములకు (చూ 43 పుట) స్పష్టముగా నర్థమెఱుఁగరాదు. మండెమురాయఁ డన్నపేరు మండెముగ్రామమున వెలసిన నరసింహస్వామికిఁ గలదు. చండనేత్రుఁ డనియో? దండనేత్రుఁడనియో? దండనేతృఁడని దిద్ది దండనాథుఁడని యర్థముగుదుర్చు కొనఁగా నాతఁడు సాళువనరసింహరాయని విద్యానగర సామ్రాజ్యలాభమునకుఁ జాలఁ దోడుపడినవాఁడును, నరసింగరాయని తర్వాత నిమ్మడినరసింహరాయఁ డను తత్పుత్త్రుడు పేరి కల్పకాలమురాజుగా నున్నను విద్యానగర సామ్రాజ్యము నాక్రమించుకొన్నవాఁడును నగు నరసింహదండనాథుఁడు కాఁగలఁడు. అన్నమాచార్యు నగ్రహారము మరులుంకు (మరువాకరై?) ఆదండనాథున కిష్టమగు ధనబలస్ఫూర్తి కలదిగాఁబోలును. (చూ 43 పుట) ఆ గ్రామమునఁ గల జీడికంపుపుల్ల మామిడిపండ్లను స్వామికి నివేదనచేసి తా నారగింపఁగా నన్నమాచార్యునకుఁ బండ్లు పులిసెను. అపచారము క్షమింప స్వామినివేఁడి దానిని దియ్యమామిడిని జేయ నర్థింపఁగా స్వామియనుగ్రహమున నది తియ్యమామిడి యయ్యెను. ఆ విషయము నీ యన్నమాచార్య చరిత్రమేకాక పెదతిరుమలాచార్యునిఁ గూర్చియున్న సంకీర్తనము కూడ నిరూపించు చున్నది.

(రాగము పేరు లేదు )


     కరము జీడిపులుసు గలిగిన మామిడి కరముసోకిన యంతనే ।
     సరవిఁజక్కెరవలెఁ జవిగలిగించువాని చనవరిసుతుఁడితఁడే ॥పల్లవి॥

వేఁకరి మండెముకోట వెళ్ళుతా విచ్చనవిడిరాఁగా వొక ।
వీఁకతో వేసిన కత్తి తునుకలాయ వెన్ను సోకినయంతనే ।
ఆకాలమునాఁడు రాతినాతిఁ జేసె అతడేపో యీతఁడు ।
వాకుచ్చి పొగడరొ ఘనపుణ్యము తాళపాకతిరుమలయ్యను ॥కర॥1

గుములుగూడి యలుఁగులు తిరుగబాఱిచుట్టుకొన్న కురువదోవనతఁడు।
కమలనయనునిఁదలఁచినమాత్రాన కకపికలైపాఱెను ।
అమరఁబాంచాలికి వలువ లొసఁగి నతఁడె వోయీతఁడు ।
ప్రమదముతోడుత పేరుకొనరే తాళపాకతిరుమలయ్యను ॥కర॥ 2