274
అన్నమాచార్యచరిత్ర
ఎనసి వైకుంఠములో నిందిరఁ గూడున్న నీకు ।
పెనఁగి గజము మొరవెట్టినయట్టు ।
చనవుతో మాకోరిక సారె విన్నవించితిమి ।
విని శ్రీ వెంకటేశుండ వేగ రక్షించరాదా ॥నీదాసు॥ 3
అన్న. అధ్యా. 247 ఱేకు.
సామంతం
దాసవర్గముల కెల్లా దరిదాపు మీరే కాన ।
వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును ॥పల్లవి॥
సేనాధిపతి నీవు చేరి విన్నవించరాదా ।
శ్రీనాథునికి నేము సేసేవిన్నపము ।
ఆనుక భాష్యకారులు అట్టే మీరుం జేయరాదా ।
మానక విన్నపముల మామనవి చనవులు ॥దాస॥ 1
వేయినోళ్ళభోగి నీవు విన్నపము సేయరాదా ।
వేయేసి మావిన్నపాలు విష్ణునికిని ।
ఆయితమై గరుడండ అట్టే మీరుం జేయరాదా ।
యేయెడ విన్నపు మా కేమి వలసినాను ॥దాస॥ 2
దేవులమ్మ యిందిర మాదిక్కె విన్నవించరాదా ।
శ్రీవెంకటపతికి చిత్తమందను ।
ఆవేళ శేషాచలమ అట్టే మీరుం జేయరాదా ।
యీ వేళ మా విన్నపము లీడేరే నింకను ॥దాస॥ 3
అన్న. అధ్యా. 247 ఱేకు
ఆచార్యుని మాహాత్మ్యమున కచ్చెరుపడి నరసింగరాయఁడు శరణు వేఁడి యాతనిచే ననుగృహీతుఁ డయ్యెను (చూ. 39 పుట.)
రాయలకైంకర్యములు
విజయనగరరాజ్యమున సురక్షితుఁడై నరసింగరాయఁడు 1495 దాఁక రాజ్యమేలెను. సంస్కృతమునఁ దచ్చరితము సాళ్వాభ్యుదయమని రచితమయ్యెను. రాయఁడే రామాభ్యుదయమని కావ్యము రచించెను. పీఠిక