Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

అన్నమాచార్యచరిత్ర


చావనేల నోవనేల సారెఁ గిందుపడనేల ।
యీవల శ్రీ వెంకటేశుఁ డింట నున్నాఁడు ।
దేవుఁ డాతఁడె నేఁడు తెలిసి కొలిచెఁగాని ।
భావించ కిన్నాళ్ళదాఁకా భ్రమపడె జీవుండు ॥చీచీ॥ 3
                                           అన్న. అధ్యా. 103 ఱేకు.


వరాళి


            ఎవ్వరివాఁడాఁ గాను యేమందు నిందుకు ।
            నవ్వుచు నాలోని హరి నన్నుఁ గావవే ॥పల్లవి॥

కోపుల రాజుల నెల్ల కొలచి కొన్నాళ్ళు మేను ।
చూపుడుఁ బూఁటవెట్టితి సొగిసి నేను ।
యేపున సంసారమున యిదిగాక కమ్మటాన।
దావుగ తొర్లుంబూఁట తగిలించుకొంటిని ॥ఎవ్వ॥ 1

మొదలఁగర్మములకు మోసపోయి యీ బ్రదుకు ।
కుదువవెట్టితి నే గుఱిగానకా ।
వెదకి కామునికి విషయములకు నే ।
నదివో నావయసెల్ల నాహివెట్టితిని ॥ఎవ్వ॥ 2

ఇప్పుడే శ్రీవెంకటేశ యీడేర్చి నామనసు ।
కప్పిన గురుఁడు నీకు క్రయమిచ్చెను ।
వొప్పించి రిందఱు బలువుఁడు చేపట్టె ననుచు ।
అప్పు లెల్లఁబాసి నీ సొమ్మైతి నే నయ్యా ॥ఎవ్వ॥ 3
                                   అన్న. అధ్యా. 325 ఱేకు.


ఆచార్యునికి సంకెల

రాయఁ డన్నమాచార్యునికి మూరురాయరగండ మని పేరుగల సంకెలవేయించి చెరసాలలోఁ బెట్టించెను. "సంకెల లిడువేళఁ జంపెడు వేళ నంకిలి ఋణదాత లాఁగెడువేళ" ఇత్యాదిగా నాతఁడు సంకీర్తనము చెప్పి సంకెల విదలించుకొన్నాడు. (చూ. 38 పుట.)