Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

269

అన్నమాచార్యుఁడు రాజసముతోఁ జాల వైభవముతోఁ గొన్నాళ్ళు వెలుగొందెను. (చూ. 35 పుట )

అన్నమయ్య శృంగారకీర్తనలు

ఈ రాయఁడు మరల నన్నమాచార్యుని నొకనాఁడు పిలిపించి స్వామివారిపై రచించిన శృంగార సంకీర్తనములు గొన్నిపాడ వేఁడెను. అన్నమయ పాడెను. (చూ. పుట 36)


చెలులార వెంకటశిఖరినాయకుని
"కలికికిఁ గడగంటఁ గనుపట్టునెఱుపు
చెలువ మేగతి నుండెఁ జెప్పరే” యనిన
“నలుపునఁ బ్రాణేశునాటిన చూపు
నిలువునఁ బెఱుక నూనినశోణితంబు
తలపోయఁ గాదుగాదా యన్నపదము
పలుమఱుఁ బాడించి పాడించి చొక్కినాఁ" డట.


ఆ శృంగార సంకీర్తనమిది.

నాదనామక్రియ


            యేమొకో చిగురుటధరమున యెడనెడఁ గస్తురినిండెను ।
            భామిని విభునకు వ్రాసినపత్రిక కాదుగదా ॥పల్లవి॥

కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోచిన ।
చెలువం బిప్పుడిదేమో చింతింపరె చెలులు ।
నలువునఁ బ్రాణేశ్వరుపై నాటిన యాకొనచూపులు ।
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు కాదుగదా ॥ఏమొకో॥ 1

పడతికి చనుఁగవమెఱుఁగులు పైపైఁబయ్యద వెలుపల ।
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు ।
ఉడుగని వేడుకతోఁ బ్రియుఁడొత్తిన నఖశశిరేఖలు ।
వెడలఁగ వేసవికాలపు వెన్నెల కాదుకదా । ॥ఏమొకో॥ 2