ఈ పుట అచ్చుదిద్దబడ్డది
268
అన్నమాచార్యచరిత్ర
నన్నమయ పాడెను. తిరుమలాచార్యుఁడుగాఁబోలును అన్నమాచార్యు సంకీర్తనముల నిట్లు సన్నుతించెను.
సురలకు నరులకు సొరిది వినవిన ।
అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు ॥పల్లవి॥
చక్కెరై చవిచూపీ జాలై తావి చల్లీ ।
నక్కజపుమాఁతు వజ్రాలై మెఱసీని ।
నిక్కుటద్దములై మానిలువు నీడలుచూపీ ।
నక్కరతాళ్ళపాక అన్నమయ్య పదములు ॥సుర॥ 1
పన్నీరై పైఁబూసీఁ గహ్రంబై చలువ రేఁచీ ।
మిన్నగల ముత్యము లై మెయినిండీని ।
వెన్ను బలములై మావెంట వెంటఁ దిరిగీని ।
అన్నిట తాళ్ళపాకాన్నమయ్య పదములు ॥సుర॥ 2
నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ ।
పుట్టుతోనె గురువులై బోధించీని ।
గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాథుని మెప్పించీ ।
నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు ॥సుర॥ 3
శేషా, వ్రాఁతప్రతి.
- ↑ ఇది “మరువాకర” కావచ్చును. ఈ పేరియగ్రహారమును అన్నమాచార్యుల కుమారుఁడు పెదతిరుమలాచార్యుఁడు స్వామికి సమర్పించెను.