Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

267


మాళవి


            అన్నియు నాయందె కంటి నన్నిటివాఁడా నేనె ।
            మున్నె నా భావముతో ముడిచివేసినది ॥పల్లవి॥

చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి ।
ములిఁగి ముక్తి దలంచి ముక్తుండనైతి ।
పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి ।
చెలఁగి శ్రీపతిఁ శ్రీవైష్ణవుఁడనైతి ॥అన్ని॥ 1

పొనఁగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి ।
పసలఁ బాపముసేసి పాపకర్ముఁడనైతి ।
వెస బ్రహ్మచారినైతి వేఱే యాచారమున ।
ముసిఁగి మఱొకాచారమున సన్యాసినైతి ॥అన్ని॥ 2

వొగి నొడ్డె భాషలాడి వొడ్డెవాఁడనైతిని ।
తెగి తెలుంగాడ నేర్చి తెలుఁగు వాఁడనైతి ।
అగడై శ్రీ వెంకటేశ అన్నియు విడిచి నేను ।
తగు నీదాసుండ నై దాసరినైతి ॥అన్ని॥ 3
                                    అన్న. అధ్యా. 266 ఱేకు.


విజయనగరరాజ్య ప్రధానరాజధాని విజయనగరమే అయినను నరసింహరాయఁ డందు స్థిరవాసముచేయలేదేమో ! రాజ్యసర్వస్వాక్రమణా నంతరమో, తత్పూర్వమో కొన్నాళ్ళాతఁడు గొప్ప దుర్గమగు పెనుగొండలోఁ గూడ నుండెను గాఁబోలును. అన్నమాచార్యునిఁ బెనుగొండకు రావించుకొని సంకీర్తనములు వినిపింపవేఁడెను.

అన్నమయ పాడుట


తేనెలపై తేట తిన్నని చెఱకు
పానకముల నేరుపఱిచిన మేలు
చక్కెరలో తీపు చల్లఁ దెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నములు
కలయమృతంబు మీఁగడమీదిచవులు
చిలుకుచుఁగవు లెల్లఁ జేయెత్తిమ్రొక్క
                                        (చూ. 33 పుట)