266
అన్నమాచార్యచరిత్ర
తావు లేలే రాజులకు దయ గొంత వుట్టదాయ ।
కావరమే ఘనమాయఁ గలికాలమహిమా ॥తతి॥ 4
నిరపరాధులఁ జంపి నెత్తురు వారించఁగాను ।
తెరల కెట్టుండిరో దిక్పాలులు ।
విరసవర్తను లుండే విపరీతకాలమున ।
గరువాలుం గపటాలె కలికాలమహిమా ॥తతి॥ 5
వుపమించి దంపతులు వొకరొకరినిం జూడ ।
చపలదుఃఖములతో నయముఁగాను ।
తపములు జపములు ధర్మము లెం దణఁగెనో ।
కపురుంబాపాలు నిండెఁ గలికాలమహిమా ॥తతి॥ 6
తలలు వడ్డీడువఁగాను తల్లులు బిడ్డల వేయ ।
తలఁపెట్టుండెనో యంతర్యామికి ।
మలసి ముక్కులు గోయ మరుఁడెట్టు వోరిచెనో ।
కలఁకలే ఘనమాయఁ గలికాలమహిమా ॥తతి॥ 7
దీనతలోఁబడి గుండెదిగు లసురుసురులు ।
వాని నెట్లు లోఁగొనెనో వాయుదేవుఁడు ।
గూనువంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తిక గోయఁ
గానఁబడె నింతేసి కలికాలమహిమా । ॥తతి॥ 8
పలుమాఱు నమ్మించి ప్రాణములు గొనఁగాను ।
యిలఁ దమలోఁ బ్రాణా లెట్లుండెనో ।
నెలవై శ్రీవెంకటేశ నీవే యెఱుంగుదువు ।
కలుషమే ఘనమాయఁ గలికాలమహిమా ॥తతి॥ 9
అన్న. అధ్యా. 373 ఱేకు.
గజపతులు విద్యానగరము నాక్రమించినప్పు డాతఁ డొడ్డెబాస నేర్చుకోవలసినవాఁడయినాఁడు గాఁబోలును. దీనిని సంకీర్తనమునఁ జెప్పుకొన్నాడు :-