Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

249


బౌళి


            ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను
            ఏమఱక కొలచిన నితఁడే దైవము ॥పల్లవి॥

ఘనముగా నిందఱికిఁ గన్ను లిచ్చుఁ గాళ్ళిచ్చు ।
పనిసేయఁ జేతు లిచ్చు బలియుఁడై ।
తనుఁ గొలువుమని చిత్తము లిచ్చుఁ గరుణించి ।
వొనర లోకాన కెల్ల నొక్కఁడే దైవము ॥ఏమి॥ 1

మచ్చిక తనుఁ గొలువ మనసిచ్చు మాట లిచ్చు ।
కుచ్చితములేని కొడుకుల నిచ్చును ।
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు ।
నిచ్చలు లోకాన కెల్ల నిజమైన దైవము ॥ఏమి॥ 2

పంతమాడి కొలచినఁ బ్రాణ మిచ్చు ప్రాయమిచ్చు ।
యెంతటి పదవులైన నిట్టె యిచ్చు ।
వింతవింత విభవాల వెంకటేశుం డిదేమో ।
యంతరంగమున నుండే అరచేతి దైవము ॥ఏమి॥ 3
                                                అన్న.అ.ధ్యా. 128 ఱేకు.


స్వామిదర్శనము (చూ. 22.పుట) ఇక్కడి వర్ణనము వంటిదే పరమయోగివిలాసమునను స్వామివర్ణనమున్నది.


ఆవరణంబుల కాదియై మిగులఁ
గొమరారు వైకుంఠగోపురంబునకుఁ
బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంతఁ
జనుదెంచి గారుడస్తంభంబు చక్కి
వినతుఁడై చెంతఁ గొవ్విరిసాల కేఁగి
వలనొప్పు చంపకావరణంబు వేగ
వలచుట్టి వచ్చి యాస్వామిపుష్కరిణి
తోయంబు లాని యుత్తుంగభామున
నాయహికులపతి యవతారమగుచుఁ