వేటూరి ప్రభాకరశాస్త్రి
247
మొనసి జలనిధి యమ్ముమొనకుఁ దెచ్చినచేయి ।
యెనయ నాఁగేలు ధరియించుచేయి ॥ఇంద॥ 2
పురసతుల మానములు పొల్లచేసినచేయి ।
తురగంబుఁ బరపెడిదొడ్డచేయి ।
తిరువెంకటాచలాధీశుఁడై మోక్షంబు ।
తెరువు ప్రాణుల కెల్లఁ దెలిపెడిచేయి ॥ఇంద॥ 3
2 వాల్యుం 215 పుట.
స్వామి మహిమలు
శంకరాభరణం పల్లవి
ఎటువంటి వాఁడవో నీ మహిమ
లెట్టుదెలియవచ్చును
నిటలలోనచనుఁడు అజుఁడు తెలియలేరు
ని న్నెట్లుదెలిసేరు మావులు ॥పల్లవి॥
తిరుమలనంబి తా తాత యన్ననాఁడె
తెలిసెఁబో మీ పెద్దతనములు ।
కురువనంబిగారి చేతిబంకమట్టి పువ్వులు
కొన్ననాఁడె తెలిసె మీభోగము।
మఱియు ననంతాళువారి చెఱువుగట్ట
మన్ను మోయఁగా దెలిసె మీనటనలు
గరుడగంభముకాడ కాను కొక్కవరమిచ్చి
గడియించఁ దెలిసె మీసంపద ॥ఎటు॥ 1
తొండమాంజక్రవర్తికి సంపద
తొలుత నియ్యఁగాఁదెలిసె మీయీవులు
అండయెఱుకువారి కొఱ్ఱచేనియెన్ను
లారగించగాఁ దెలిసె మీరుచులు ।
వుండి గొల్లలకావిళ్ళపాలెల్ల
వుట్టుకోఁగఁ దెలిసె మీనేమములు ।