244
అన్నమాచార్యచరిత్ర
అనయము శ్రీవెంకటాద్రిదేవునిబంటు ।
వెనుబలమై యున్నాఁడు విట్ఠలములోనను ॥మొక్కరో॥ 3
అన్న. అధ్యా. 252 ఱేకు.
ప్రసాదములు
దేసాక్షి
ఏ పొద్దుచూచిన దేవుఁ డిట్లనె యారగించు
రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెనూ ॥పల్లవి॥
మేరుమందరాలవలె మెఱయు నిడ్డెనలు ।
సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు ।
ఆరని రాజాన్నాలు అందుపై వడ్డించఁగాను ।
బోరన చుక్కలు రాసివోసినట్లుండెను ॥ఏపొద్దు॥ 1
పలుజలధులవంటి పైఁడివెండి గిన్నెలు ।
వెలిఁగొండ లంతలేసి వెన్నముద్దలు ।
బలసిన చిలువాలు పంచదార గుప్పఁగాను ।
అలరువెన్నెల రస మందిచ్చినట్లుండెను ॥ఏపొద్దు॥ 2
పండిన పంటలవంటి పచ్చళ్లుఁగూరలును।
పండి యలమేలుమంగ వడ్డించగాఁ ।
అండనె శ్రీ వెంకటేశుఁ డారగించి మిగులఁగ ।
దండిగా దాసులకెల్ల దాఁచినట్లుండెను ॥ఏపొద్దు॥ 3
అన్న. అధ్యా. 252 ఱేకు.
స్వామి దర్శనము
శంకరాభరణం, అటతాళం
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము
నెడయకవయ్య కోనేటిరాయఁడా ॥పల్లవి॥
కోరి మమ్ము నేలినట్టికులదైవమా, చాల।
నేరిచి పెద్ద లిచ్చిన నిధానమా ।