వేటూరి ప్రభాకరశాస్త్రి
243
నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద ।
దేవతలఁ గనిపించే దేవుండవు ।
యేపంక విచ్చేసినాను యిందిరాసతికి నిజ ।
సేవకుండవు నీవేకా సేనమొదలారి ॥నీ వేకా॥ 1
పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువ ।
దెసలఁ బంపులు వంపే ధీరుఁడవు ।
వనముగా ముజ్జగాలవారి నిందఱిని ।
సిసువులఁగా నేలిన సేనమొదలారి ॥ నీవేకా॥ 2
దొరలైన యసురులఁ దుత్తుమురు సేసి జగ ।
మిరవుగా నేలితి వేకరాజ్యమై ।
పరగుసూత్రవతిపతిపై వెంకటవిభు ।
సిరులపెన్నిధి నీవె సేనమొదలారి ॥నీవేకా॥ 3
అన్న. అధ్యా. 42 ఱేకు.
హనుమంతుఁడు
సాళంగనాట
మొక్కరో మొక్కరో వాఁడె ముందర నిలుచున్నాఁడు ।
యెక్కువ రామునిబంటు యేకాంగవీరుఁడు ॥పల్లవి॥
పెట్టినజంగతోడి పెద్దహనుమంతుఁడు
పట్టెను యెడమచేత బలుముష్టి ।
మెట్టినాఁడు పాదముల మించురాకాసితలలు ।
కొట్టే ననచు నెత్తె గొప్పవలకేలు ॥మొక్కరో॥ 1
వంచెను శిరసుమీఁద వాలుగాఁ దనతోఁక ।
పెంచెను మిన్నులు మోపఁ బెనుదేహము ।
నించినాఁడు రౌద్రము నిడుపాటిదవుడల ।
కాంచనపుఁబట్టుకాసె కడు బిగించెను ॥మొక్కరో॥ 2
పెనఁచి తొడలుదాఁక పెద్దపదకము వేసెఁ
తనువుపై వ్రేలాడేదండలతోడఁ