Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

అన్నమాచార్యచరిత్ర

ప్రసాదములను నడగోపురమును శ్రీనివాసుని భాష్యకారులను నరసింహుని జనార్దనుని అలమేలుమంగను యాగశాలను ఆనందనిలయమును కళ్యాణమంటపమును బంగారుగరుడుని శేషుని పునుఁగుచట్టలనుకాచి తైలము వడియఁగార్చు ప్రదేశమును స్వామినిస్తుతించు చిలుకల పంజరములను శ్రీ భండారమును బంగారుగాదెలను బంగారువాకిటిని దర్శించి స్తుతించి లోనికి స్వామిని సేవింప నరిగెను. ఈ సందర్భములలోఁ బెక్కింటికి సంకీర్తనము లున్నవి.

దేవాలయప్రవేశము

పాడి


               సేవించి చేకొన్న వారి చేతిభాగ్యము ।
               వేవేగ రారో రక్షించి విష్ణుఁ డీడను । ॥పల్లవి॥

గరుడగంభముకాడ కడుఁ బ్రాణాచారులకు ।
వరము లొసఁగీని శ్రీవల్లభుండు ।
తిరమై కోనేటిచెంతఁ దీర్థఫలము లెల్ల ।
పరుషల కొసఁగీని పరమాత్ముఁడు ॥సేవించి॥ 1

సేనమొదలారివద్ద చిత్తములో సుజ్ఞానము ।
నానాగతిఁ బుట్టించీని నారాయణుండు ।
కానుక పైఁడిగాదెలకాడ నిజరూపు ।
అనుక పొడచూపీని అఖిలేశుఁడు ॥సేవించి॥ 2

సన్నిధి గర్భగృహాన చనవిచ్చి మాటలాడి ।
విన్నపాలు వినీ శ్రీ వేంకటేశుఁడు ।
ఎన్నికం బాదాలవద్ద ఇహము పరముఁ జూపీ।
మన్ననల నలమేలుమంగవిభుఁడు ॥ సేవించి॥ 3
                                       అన్న. అధ్యా. 288 ఱేకు.


విష్వక్సేనుఁడు


               నీవేకా చెప్పఁ జూప నీవేకా ।
               శ్రీవిభుప్రతినిధివి సేన మొదలారి ॥పల్లవి॥