238
అన్నమాచార్యచరిత్ర
దవ్వులామటనుండి నీవు పువ్వులఁ బూజించితే అవి ।
చివ్వున అప్పనియడుగుఁ దామెరలపై చెలఁగియప్పుడే నిలిచె ।
పువ్వులకు ఱెక్కలున్నవో లేక పుండరీకాక్షుని మహిమో ।
నివ్వటిల్లు నీ భక్తియోకాని నేఁడు నాతోఁ జెప్పవే ॥కురు॥
పొంకపుదోసిటి యడుసున లెస్స పొరలిన గన్నేరుఁ బువ్వులు ।
కుంకుమగంధ మాకల్పములపై కోరివేడి నిలిచె ।
బంకమ న్నది యెంతవాసనో లేక పారిజాతములకెక్కుడో ।
వెంకటపతికెంత వేడుకో నాకు వివరింపవె అప్పయ్య ॥కురు॥
దోసిటిలోపలఁ బెట్టిన శ్రీతులసి సేవంతిపువ్వులు ।
వాసిగ జగమెల్ల కుక్షిలో నిడుకొన్నవాని మేనెల్లనిండె ।
వేసదారి యలమేలుమంగ శ్రీ వేంకటేశ్వరుని మహిమో నీ ।
దాసరితనము బలమో కాని తలఁపునాతోఁ జెప్పవే ॥కురు॥
శేషాచార్యులుగారి వ్రాఁతప్రతి.
పెద్దయెక్కుడు
ఇక్కడ మెట్లు నిట్టనిల్వునను చాలాయెత్తుగాను నుండును. తిరుమల యెక్కుటలో నెక్కువశ్రమకర మయినయెక్కు డిది.
కర్పూరపుఁగాలువ
"కపురంపుఁదావులు గడు నూలు కొలువు "కపురంపుఁగాలువ” యట. పెద్దయెక్కుడు దాటినతర్వాత మోఁకాళ్ళ ముడుపునకుఁ బూర్వమీకాలువ గలదట. అక్కడ నా సెలయేటి జాలునీళ్ళు సుగంధము గలిగి యుండునట. సేవాక్రమమున నిట్లున్నది. "తతఃకర్పూరసురభి తీర్థం కర్పూర నిర్ఘరమ్”.
మోఁకాళ్ళ ముడుపు
సాలగ్రామమయమైనది గనుక నిఁకమీఁదఁ బర్వతము పాదములతోఁ గాక మోఁకాళ్ళతో నడచుట జరిగెడిదట. కాన, మోఁకాళ్ళ ముడుపని పే రయ్యె నందురు. ఒక్కొకమెట్టు మోఁకాలి యెత్తుగలిగి మోఁకాళ్ళు ముడుచుకొనుచు నెక్కవలెను. గనుక నా పేరయ్యెననియు నందురు.