Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

227

బట్టి, అన్నమాచార్యుల పుత్రపౌత్రాదులు రచించిన సంకీర్తన కావ్యాదులనుబట్టి, కూడఁ దచ్చరిత్రము కొంత గుర్తింపనగును. నలుదెఱఁగుల సాధనములను గ్రుచ్చి యెత్తి హృద్యమయిన తచ్చరిత్రము నుద్ధరింప యత్నింతును.

అన్నమయ వంశము

అన్నమాచార్యుఁడు నందవరవైదిక బ్రాహ్మణవంశమున జన్మించినాఁడు. ఈ వంశమువారు ఋగ్వేదులు ఆశ్వలాయనసూత్రులు. భరద్వాజగోత్రులు. పొత్తపినాఁటిలోని తాళ్ళపాకగ్రామమున[1] నుండినవారు.

లభించిన తాళ్ళపాకవారి యితర గ్రంథములలో నెందుఁగాని యన్నమయ పితృపితామహాదుల ప్రశంస లేదు. ఇందే అది కలదు. (చూ, 4 నుండి 8 పుటలు) అన్నమాచార్యుని తాత విద్యాభ్యాసమునకు ఊటుకూరను బంధుగ్రామమున కరిగినట్లున్నది.[2]

అవతారము

అన్నమాచార్యుని తల్లి లక్కమాంబ[3] మాడుపూరి మాధవస్వామి భక్తురాలట. అది యామె పుట్టినింటివారి యూరు గాఁబోలును. అన్నమయ శక. 1346 క్రీ. 1424 క్రోధి వైశాఖమాసమున విశాఖా నక్షత్రమున జన్మించినాఁడు. పన్నిద్దరాళ్వార్లలో ముఖ్యులగు నమ్మాళ్వార్లు (శఠకోపయతి) కూడ వైశాఖవిశాఖనే జన్మించిరి. జన్మోత్సవము పుట్టిన నక్షత్రమును బట్టియును, నిర్యాణోత్సవము చనిపోయిన తిథిని బట్టియును జరుపుట సంప్రదాయము. వైశాఖమాసమున విశాఖా నక్షత్రము ప్రాయికముగా పూర్ణిమాతిథికి వచ్చును. కనుక వైశాఖ పూర్ణిమ జన్మతిథిగాఁ గూడ నిర్ణయింప వచ్చును. శక. 1424, క్రీ.శ 1503 దుందుభి ఫాల్గుణ బహుళ ద్వాదశినాఁడాతఁడు దివ్యధామ మందినాడు. అతని జీవిత పరిమాణము 79 ఏండ్లు. ఇటుచూడఁగా నేఁటి

  1. తాళ్ళపాక నేఁటి కడపజిల్లా రాజంపేట తాలూకాలోనిది.
  2. చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయనిమీఁద సంకీర్తనములు రచించెను. ఊటుకూరు తాళ్ళపాక దగ్గఱనే రాజంపేట తాలూకాలోనే నేఁడున్నది.
  3. మాడుపూరు, కడపజిల్లా సిద్ధవటము తాలూకాలో నున్నది.