Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

వేంకటేశ్వర లఘుకృతులు

వేంకటేశ్వరపంచకము:- ఇదియుఁ బైదానివంటిదే. రచయిత పేరెఱుఁగరాదు.

వేంకటాచలేశశతకము :- ఇది మంచిరచనా చమత్కృతి గలది. అసమగ్రముగా రచయిత రెఱుఁగరానిదిగా దొరకుటయ్యెనే యని చింతిల్లవలసిన రచనము.

వేంకటాచలపతి శతకము : - స్తుతి సుందరమైన మంచిరచన. అసమగ్రమే. రచయిత పేరెఱుఁగరాదు.

మేల్నాటి వేంకటేశశతకము :- మంచిరచనగలది. స్తుతిసుందరమైనది. రచయిత పేరెఱుఁగరాదు.

వేంకటనగాధ్యక్షశతకము :- చాల విలువగల ప్రశస్తరచన. అసమగ్రముగా దొరకుట, రచయిత పేరెఱుఁగరాకుండుట, వింతగొల్పుచున్నది. దొరకిన పద్యములు వరాలవంటివి.

వేంకటశైలనాయకశతకము :- యమకాలంకారమును దేసి తెలుఁగు తెఱఁగును గల శృంగారశతకము. అసమగ్రముగా రచయిత పేరు లేనిదిగా దొరకినను దీనికర్త ప్రబంధరాజవిజయవేంకటేశ్వర విలాసకర్త గణప వరపు వేంకటేశ్వరకవియగుట గుర్తింపనయ్యెను. అతఁడు దన ప్రబంధరత్నాకరమున నిందలి పద్యమును కమ్మనితమ్మిదోదుమిని ఇత్యాదిక మునుతనయమకశతకములోనిదానిఁగా నుదాహరించుకొన్నాఁడు. ఆ పద్యమును బట్టి యీ శతకము తత్కృత మగుట స్పష్టము.

శ్రీ వేంకటేశ్వరకల్యాణము :- ఇది మంచిగేయరచన. కర్త పేరెఱుఁగరాదు. అసమగ్రముగానే దొరికినది. తుదిగేయములు మూఁడు నేను కూర్చి ముగియఁజేసితిని.

అలమేల్మంగాస్తవము :- ఇది మంచికవితారీతిగల స్తుతించన. కర్తపే రెఱుఁగరాదు.

ప్రసన్న వేంకటేశ్వరమంజరి :- ఇది మంచిరచనము. శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి మైసూరిచికదేవరాయని పరిపాలనకాలమున తత్పాలిత