Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

219

అన్నమాచార్యుల శృంగారసంకీర్తనములు కొన్ని మాత్రము చెక్కిన ఱేకులుగాఁ గానవచ్చుచున్నవి. వీనిలోని గేయములే పెక్కులు, మీఁదవర్ణితములయిన అన్నమాచార్యుల శృంగారసంకీర్తనపు ఱేకులలోనున్నవి. కొన్ని పాటలు చెక్కించిన పిదప ఱేకులధైర్ఘ్యము, పలుచన వాని చిరస్థితికి భంజక మగునని వెఱచి, వానినే మరల క్రొత్తతీరు ఱేకుల కెక్కించి యుందు రనుకొనవచ్చునేమో!

అహోబలమఠమునఁ దాళ్ళపాకరచనములు కలఱేకులు కొన్నియున్నవట! వానిని గూడఁ దెప్పింప యత్నించుచున్నాము. అవి వచ్చెనేని యిప్పుడు కానరాని ఱేకులో, మఱికొన్ని క్రొత్తరచనములో లభింపఁగల వనుకొందును.

1937 సంవత్సర ప్రాంతముననే శ్రీదేవస్థానము కమిటీవారి నిదేశముననే అన్నమాచార్యుల మిగిలిన శృంగారసంకీర్తనముల ముద్రణమారంభమై ఆరు ఫారముల ముద్రణము సాగి నిలిచిపోయెను. తన్ముద్రాపకులు, అన్నమాచార్యుల తొలి ఱేకుననున్న యుపక్రమ వాక్యముల మరల ముద్రించి, యముద్రితములుగానే యున్న యన్నమాచార్యుల 31 నుండి 41 దాకగల నుజ్జగించి 42వ ఱేకునుండి ముద్రణ మారంభించిరి.

మే మీఱేకులను, బుస్తకములను బరిశీలింపఁగా ముద్రణ మపక్రమముగా సాగుచుండుట తెలియవచ్చెను. విడనాడఁబడిన 31 నుండి 41 దాక గల ఱేకుల గేయములను, నప్పటికిక ముద్రితములయిన 42 నుండి 60 దాక గల ఱేకుల సంకీర్తనములకు దర్వాత చేర్చి ముద్రించితిమి.

ఈ సంపుటములో ముద్రితములైన అన్నమాచార్యుల శృంగార సంకీర్తనల ఱేకులు.

ఱేకు నంబరు. ఱేకులలోని మొదటిపాటల మొదళ్లు. అచ్చుపుటసంఖ్య.
81 ఎటువంటి మోహంబు 121
82 తానేచూడవే యీతండు 80
33 ఇయ్యింతి మురిపెము యెట్లుండెనే 84
34 ఏటి తమకమె నాకిఁకను 88
35 తొయ్యలికొప్పున సేవంతులు 92
36 కన్నులతుదలం గెంపు గానరాఁగాను 96