210
వేంకటేశ్వరవచనమలు
రచనమును జాలఁ దర్వాతిదిగానేయున్నది. కాని యీతనిదే యగు [1]శ్రీపాదరేణుమాహాత్మ్యముగద్య మాతఁడు సంకీర్తనాచార్యుని మనుమఁడే యనఁదగినట్లున్నది :-
'ఇది సంకీర్తనాచార్య దౌహిత్ర రేవణూరి తిరుమలకొండ యాచార్యపుత్ర వేంకటాచార్య ప్రణీతం బైన శ్రీపాదరేణుప్రభావం బనునిస్సహాయ కావ్యంబు నందు రంభాపురందరసంవాదం బనునది తృతీయోల్లాసము.' ఇది తప్పయి యుండునేమో ! సంకీర్తనాచార్య దౌహిత్ర వంశ్య' అని యుండఁదగునేమో !
గ్రంథముద్రణము
ఇప్పటి కిరువది యేండ్ల క్రిందట నే నీ వేంకటేశ్వర వచనములను బ్రాచ్యలిఖిత పుస్తక శాలలోని ప్రతులఁబట్టి యుద్ధరించి 'భారతి' పత్రికలోఁ బ్రకటింపఁ బూనితిని. అప్పటికి తాళ్ళపాకవారు రచించిన వయియుండునని నే ననుమానించితినేకాని దాని కాధారమేదియు నాకు గానరాలేదు. అప్పుడు ప్రకటించుటలో నే నిట్లు వ్రాసితిని.
"ఇవి తాళ్ళపాకవారు రచించినవై యుండవలెను. వీనిలో విష్ణుభక్తి యూటలూరుచున్నది. ప్రాచీనములలో నింత రసవంతయు, భక్తిభరితము నగు వచనరచన యసాధారణముగా నున్నది. కృష్ణమాచార్య సంకీర్తనములు శంకర వచనములు మొదలగునవి వ్రేళ్ళలెక్కకుఁ జాలినవి, యిట్టివి, కొన్నియున్నవి. వీనినెల్లఁ గ్రమముగా వెల్లడింపఁ గోరికపడుచున్నాను. సహృదయ లివి చవిగొందురుగాక!” (భారతి - క్రోధన వైశాఖము)
'భారతిలో నట్లు ప్రకటించుచుండుటఁ జూచిన సహృదయులు గొందఱు నన్నావచనములెల్ల గ్రంథముగా ముద్రింపఁగోరిరి. అట్లే నేను వానిని మదరాసులో 'నాంధ్రపత్రిక ముద్రణాలయము' ననే ముద్రింపఁబూనితిని. నూటయిర్వది వచనములు 80 పుటలు ముద్రితములయ్యెను. అప్పుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర దేవస్థానోద్యోగులొకరిద్దఱు నా మిత్రులా గ్రంథము తిరుపతి దేవస్థానమువారు ముద్రించుచుండుట నా కెఱింగించిరి.
రాగిరేకులపైఁ గవికాలమునఁ జెక్కఁబడియున్న యావచనముల నుద్ధరించి
- ↑ ఇది తిరుపతి ప్రాచ్యపరిశోధనశాల లైబ్రరీలో నున్నది. కృత్యవతరణిక లేదు.