Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

209


1. మూలపురుషుఁడు శృంగార సంకీర్తనాదిగ్రంథకర్త.

2. వేంకటేశ్వరోదాహరణాది బహుగ్రంథకర్త. వేంకటేశ్వరవచనకర్త కూడ.

3. సంకీర్తనలక్షణాది గ్రంథకర్త.

4. అష్టమహిషీకల్యాణ పరమయోగివిలాసోషాపరిణ యాన్నమాచార్య చరిత్ర గ్రంథకర్త.

5. ఆంధ్రామరుకామరవ్యాఖ్యా కావ్యప్రకాశవ్యాఖ్యాకర్త.

6. శకుంతలాపరిణయము, శ్రీపాదరేణుమాహాత్మ్యము ఇతని కృతులు.

ఈ తాళ్ళపాకవారికి రేవణూరివారు జామాతృ వంశమువారు. రేవణూరి వేంకటకవి తన శకుంతలా పరిణయమున నిట్లు చెప్పినాఁడు.


శ్రీవత్సాన్వయ రేవణూరికులజున్ శ్రీపాదరేణుప్రభా
సౌవర్ణస్ఫుట కావ్యకల్పక కవిన్ సంకీర్తనాచార్యపు
త్త్రీవంశోత్తము నందవైదికబుధాతిప్రోక్తవృత్తిస్వయం
భావుం దిర్మల కొండయార్యసుతు శుంభద్వేంకటాభిఖ్యునిన్.


శ్రీ వేంకటరమణునకు... సమర్పణంబుగా సమర్పించెద నిహపరసాధనములకు నింక నేమి కొదవ యదియునుం గాక యమ్మహాదేవుండు మదీయమాతామహవంశ శిఖారత్నం బగు నన్నయాచార్యునకు జామాతరుం డనిపించుకొని భవదీయసంకీర్తనంబు లాలించిన కర్ణంబుల నితరసంకీర్తనంబు లాలించ నని ప్రతిజ్ఞఁగావించెఁ దత్తనూజుం డగు పెద్దతిరుమలాచార్య బిడౌజకునకుఁ ద్రిపురుష పర్యంతముగాఁ బ్రత్యక్షంబును, సప్తపురుషపర్యంతముగా మోక్షంబు నొసంగెద నని వరమిచ్చె; సచ్చరిత్రులగు తదీయపౌత్రులకుఁ జినతిరుమలదీక్షి తాన్నయాచార్య తిరువేంగళనాథ కోనేటితిరువేంగళనాథ వెంగళార్యులకు విచిత్రముక్తాతపత్ర రత్నకిరీట ముద్రికాప్రచండమణిమండిత మకరకుండ లోత్కరాహః కరదీపికా పాదుకాది బహూకరణంబులఁ గరుణించె; విశేషించియు నత్తిరువేంగళనాథుండు సంకీర్తనంబుఁ బాడిన నాడం దొడంగె నేతత్ప్రకారంబున నమ్మహామహునకుఁ బాండవసహాయుండైన శ్రీకృష్ణదేవునింబలె సహాయుండై.............. ధన్యుఁడనయ్యెద నని నిశ్చయించి'

ఈ గ్రంథమును బట్టి చూడఁగా నీ వేంకటాచార్యకవి సంకీర్తనాచార్యుఁ డగునన్నమాచార్యునికి దౌహిత్ర వంశములోనివాఁ డని యేర్పడును.