వేటూరి ప్రభాకరశాస్త్రి
189
యక్షుని సందేశము శ్రోత్రపేయ మైనదని “సందేశం మే....... శ్రోష్యసి శ్రోత్ర పేయమ్" పూ. మే. శ్లో. 13న. యక్షోక్తి రూపమునఁ గాళిదాసు చెప్పెను. ఉత్తర మేఘమున నా సందేశము 10 శ్లోకములలో నున్నది. అందు "శ్యామాస్వంగం..." అను శ్లోకము మొదలు 6 శ్లోకములలో యక్షుని విరహావస్థయు, “నత్వాత్మానం" అను శ్లోకము మొదలు 4 శ్లోకములలో నిరాశచేఁ బ్రాణములు గోల్పో వలదని యక్షినోదార్చుటయుఁ గలవు. మొదటి 6 శ్లోకములకు "జీవితేశ్వరి ! నిన్నుఁ బాసియు... వినఁగదే" అను మకుటమును, గడమ 4 శ్లోకములకు, "తెగువ సేయకుమాస తెగఁ గోసికొని ........... మన్నింపుము" అను మకుటమును విషయానుగుణముగా సందర్భోచితముగా 7 మాత్రలును 5 మాత్రలునుగల గణముల గీతికలలో శ్రీ ప్రసాదరావుగారు కల్పించిరి. ఆ సందేశ మందలి 'శ్రోత్రపేయత” శ్రీ ప్రసాదరావుగారి తెలుఁగుసేఁతలో మూలాధికమై మురిపించుచున్నది.
ఇది ప్రయోగార్హము
రస భావమయ మయిన కథార్ధము, అభినయ నాట్య గానానుకూల్యముతో నందచందము లొదవిన పదబంధమును గల యీ గేయ రూపకము రసిక విద్వత్సామాజిక సమక్షమునఁ బ్రయోగమును బడయఁ దగియున్నది. సామాన్య జనులు సామాజికు లగుచో దీని ప్రయోగ సౌభాగ్యము ననుభవింపఁజాలరు.
కృత్యాది రచనలు
శ్రీ సూర్య ప్రసాదరావుగారు రచించిన పద్యములు 'పెంపుడు బిడ్డ' యన్నవి సుమనో మనోజ్ఞములు. 1, 4, 5, 13, 17, పద్యములు చదువుటలో నా తలఁపులు పులకరించినవి. శ్రీ సాహిత్య సమ్రాజులు శ్రీశ్రీశ్రీ విక్రమదేవ వర్మ మహారాజులుంగారి దత్తపుత్త్రికా కళ్యాణ పద్యములు కవితా రచనమయ్యుఁ గవి కల్పనగాక నిక్కపుఁ బల్కుఁ జక్కందనముతో నిగ్గులు దేరియున్నవి. కాళిదాసాశ్రయ మగు విక్రమ నామమునకు నాంధ్రకాళిదాసాశ్రయమగు విక్రమ నామమునకు నైక్యమును, గృతి కన్యను బెంచుకొని రామార్పణము గావించుటలో విక్రమభూపునకు జనకసమానతయునంద