Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

మొయిలు మెఱుగులు

ఇంతకుముం దాంధ్ర కవీశ్వరు లనేకులు బహు సమర్థులే తెలిఁగించినను నా యన్నింటికంటె నీ మొయిలు రాయబారము గుణోత్కర్షము గలదనుట నిర్వివాద విషయము. అందఱ తెల్గుసేఁతలు నిందుకు లొంగిపోవుటకుఁ బ్రస్తుత కవికిఁ దెలుఁగు బలుకుఁ బొలఁతిని నాలుకపై వలసినట్లెల్ల నాట్యమాడింపఁగల మెలపునుఁ దెలుఁగునాఁట నేఁడు విలసిల్లుచున్న దేశిరచనాపరిణామముఁ జక్కఁదిలకించి దిద్ది తీర్పఁగల నేర్పును, అసాధారణమగు రసార్ద్రహృదయతయుఁ బ్రధాన కారణములు.

దేశిరచన

తెల్గు బాసకు దేశి యగు ఛందో రచన నన్నయాదుల నాటనుండియు నంతగాఁ బ్రాముఖ్యముఁ బడయదయ్యెను. ఈనడుమనే యది పరిపోషణముఁ బడయ సాగినది. ఈ విషయ మెల్లఁ బ్రపంచించుట కిది చోటుగాదు. శ్రీ ప్రసాదరావుగారు మందాక్రాంతావృత్తములలో నున్న సంస్కృత గ్రంథమును దెలుఁగున దానికిఁ జేరికగాఁ జెప్పఁదగిన దేశి చ్ఛందోభేదములతోఁ దెలిఁగించిరి. అవి సీస, ద్విపద. తరువోజ, రగడ, రచనల కందిపొందియున్నవి. మూలము ప్రతిపద చమత్కార భరిత మయిన కాళిదాసుకృతి యగుట, పరివర్తనము రససిద్ధుని రచన మగుట, ఛందము దేసి యగుట, యీ తెలుఁగుకృతి కింత పొలుపు గూర్చినవి.

సీసపద్య ప్రథమ దళసమానగతితో నైదుమాత్రలగణములు గలిగి మందాక్రాంతా ఛాయ గలపద్యముగాను, సీసచ్ఛాయ గలపద్యముగాను, ఖండగతి - ఝంపె- చాపు - తాళములలోఁ బదములుగాను, ఆధ్యాత్మ రామాయణకీర్తనము, గజేంద్రమోక్షకీర్తనము (రాజేంద్ర విను సుధా రాశిఁ ద్రికూటాద్రి - ఇత్యాదికము) ల మట్టునను, హృద్యముగాఁ జదువఁ దగియున్నది.

ఛంద మిందు మాత్రాగణ ఘటితముగాన గురులఘ్వక్షర పరివర్తనానుకూల్యము, యతి ప్రాసాన్యతర సంధాన సౌకర్యము, అలల వంటి పెద్దపెద్ద చరణముల యూపుటొయ్యారము, సమకూరి కవికిఁ బరివర్తనమున స్వైరవిహారసౌఖ్యము నొసఁగినవి. రచనము లిట్టివి మన తెలుఁగునఁ