Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

175

సుగ్రీవ విజయము వీరకరుణరసభరితము. స్త్రీ బాల పామరాదులు గూడఁ బఠింపఁ దగినది.

ఆ యక్షగానమున నీ క్రింది దేశిరచన లున్నవి. త్రిపుట, జంపె, కుఱుచజంపె, అర్ధచంద్రకలు, ఆటతాళము, ఏకతాళము, ద్విపదలు, ధవళములు, ఏలలు. అర్ధచంద్రికలు త్రిపుటాదిరచనల ఖండరచనలు గాఁబోలును. ఇందలి యర్థచంద్రిక లెల్ల నొక్క తెఱఁగునడక గలవి గాక భిన్న గతులతో నున్నవి. సంగీతతాళ లక్షణము లెఱిఁగినవారు వాని ప్రభేదములు గుర్తింపవలెను.

కురవంజులు, యక్షగానములు నింకను మంచిరచనములు గలవి కొన్ని యున్నవి. అవి యేవేని సుగ్రీవవిజయమువలె సుముద్రితము లైనచో నాంధ్రమధురకవితావిశేషములను సహృదయు లింక నధికముగా నాస్వాదింపఁ గల్గుదురు.


మద్రాసు

వేటూరి ప్రభాకరశాస్త్రి

బహుధాన్య మహాశివరాత్రి


(ముని పలుకు - సుగ్రీవవిజయ పీఠిక 1939)