Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix

నిరూపించలేమని వారి అభిప్రాయం. అదీ భాషా సాహిత్య పరిశోధనలో వారి తాదాత్మ్యం.

బాలసాహిత్యం విలువ ఎటువంటిదో పిల్లల వాచకపు పుస్తకాలు ఎట్లా ఉండాలో సుమారు డెబ్భై ఏళ్ళనాడే శ్రీ శాస్త్రిగారు చెప్పిన విషయాలు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈనాడు సంఘంలో పసివయస్సుననే నేర్చుకొనే విషయాలు అర్ద్రభావ సంగతం కాకపోవడం, వాటిలో సృజనాత్మకోద్దీపన లేకపోవడం సాంస్కృతికమైన ప్రాతిపదికవికసనం బుడుత బుద్ధులలో చేకూర్చలేకపోవడం వారు ప్రస్తావించారు. “ఉన్నత కవితా వాహినికి బాల వాఙ్మయ మూటపట్టని చెప్పవచ్చును" అంటారు వారు.

ఇందులో నాచన సోముని ఉత్తరహరివంశానికి, శ్రీనాథుడి హరవిలాసానికి శ్రీ శాస్త్రిగారు కూర్చిన పీఠికలు పరిమాణంలో చిన్నవైనా గుణవత్తరాలు. నన్నయ భట్టారకుడి ధారాశుద్ధీ, తిక్కన భావగాంభీర్యం సోమనాథుడి కవితలో కనపడుతున్నా శయ్యాసౌభాగ్యం అతిమాత్రమై అర్ధసౌలభ్యం కొంతవరకు కొరవడిందని శ్రీ శాస్త్రిగారి వంటి మహావిద్వాంసులు మాత్రమే చెప్పగలరు. కవికాలాదికాన్ని గూర్చి పూర్వ హరివంశపు ఉనికి సంభావ్యతను గురించి అనేక విషయాలు చర్చించి నాచన సోముని కవితాగుణాన్ని సిద్ధాంతీకరించారు. 'ఆంధ్రకవులలో చిత్ర కవిత్వమును వెలయించిన వారిలో నీతడే ప్రథముడుగా గానవచ్చుచున్నా డన్న విషయాన్ని నిరూపించారు. హరవిలాసంలో శ్రీనాథుడు కాళిదాస కుమార సంభవాన్ని అనుకరించే సన్నివేశాలలో ఏవిధంగా 'పాడు' చేసిందీ 'పాడి' చేసిందీ హృద్యంగా వివరించారు. మూలాతిశాయి సౌందర్య సంపాదకములని కొన్ని ఘట్టాలు చూపారు. 'పై శ్లోకమునకు శ్రీనాథుని తెలుగు పద్యము సరియయినదికాదు' 'నన్నయ భట్టారక పద్యానుకరణోత్సహమున శ్రీనాథుడు కాళిదాస శ్లోకరసభావౌచిత్యానుశీలనమును మరచినాడు' అన్నారు. "అధ్వాన ' పదాన్ని గురించి శ్రీ శాస్త్రిగారు చేసిన చర్చ వారి సర్వతోముఖవిద్వత్తకు తారకాణగా నడిచింది. "కర్ణాటమున బంపకవి విక్రమార్జున విజయములో 'అధ్వాన పదపరిశ్రమ శ్రాంత' యని ప్రయోగమున్నది. తన్ముద్రాపకు