ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వేటూరి ప్రభాకరశాస్త్రి
167
కామవల్లీ మహాలక్ష్మి కైటభారి
వలపు వాడుచు వచ్చె జక్కులపురంధ్రి.
అప్పకవి యక్షగానలక్షణము నిట్లు చెప్పినాఁడు.
సీ. తుద నేడులఘువులు తొలఁగించి చదివినఁ
ద్రిపుటకు వృషభగతిపదయుగము
లలిఁ గడపల నొక్క లఘువు మానిన జంపె
మను ద్విరదగతిసమపదయుగము
గురు తగురచ్చెకుఁ దురగవల్గనా
హ్వయ మేక తాళి యామధురతికి (?)
నంఘ్రి కిర్వదినాలు గటతాళమున మాత్ర
లోలి విశ్రాంతి పద్నాలుగింటఁ
దెలియ నర్థంబు నర్థచంద్రికలు వీన
యక్షగానప్రబంధంబు లతుకవచ్చు
రగడభేదంబు లివి యండ్రు రసఁ గవీంద్రు
లవిత నిజసేవకస్తోమ ! యబ్ధిధామ !