వేటూరి ప్రభాకరశాస్త్రి
159
హరవిలాసపు వ్రాఁతప్రతులఁ బరిశీలింతునుగదా - అందు 'జలక మార్చిరి యిచ్చిరి ధౌతవస్త్రముల్' అన్నపాఠమున్నది. 'ఒసంగిరి' అన్న పూర్వ పూర్వతర ముద్రణ పాఠము గానరాదు. ఆముక్త మనుచరిత్రాద్యర్వాచీన గ్రంథములందు 'ఒసంగు' సానుస్వారముగా నున్నది.
అధ్వాన్నంపుం బట్టునన్ ( 74 పుట) - 'అధ్వాన్నము శత్రుమధ్యము' నని నానుడి కలదు. దాని ననుసరించి పై యట్లు ముద్రిత మయ్యెను. 'అధ్వానము' అనియే వ్రాతఁప్రతి. 'అధ్వ' శబ్దము తత్సమ రూపము 'అధ్వానము' కాఁబోలును. శ్వ. శ్వాన శబ్దములు సంస్కృతముననే యున్నవి. అట్లే అధ్వ, అధ్వానశబ్దములు నున్నవేమో ! శబ్దరత్నాకరకారులు అధ్వానము = అమార్గము అని యర్థముతో అకారాంత సంస్కృతపదముగా గ్రహించిరి. కర్ణాటమునఁ బంపకవి విక్రమార్జున విజయములో 'అధ్వాన పదపరిశ్రమ శ్రాంత' యని ప్రయోగ మున్నది. తన్ముద్రాపకు లాయధ్వాన పదమును మార్గార్థముగా గ్రహించిరి. మార్గమని, అమార్గ మనియేని గ్రహించినను, శ్రీనాథుని 'యధ్వానపుం బట్టు' సమర్థితమగును. వ్రాఁతప్రతి పాఠము పరిగ్రాహ్యమే కావచ్చును. కాని తెల్గున నిఁక నెక్కడను నీ 'యధ్వానము’ నాకుఁ గానరాలేదు. వాచస్పత్యమున 'అధ్వాంత శాత్రవః= మార్గసీమారిపుః' అని యున్నది దానిఁబట్టి 'అధ్వాంత' మని యుండిన బాగనిపించును.
శా. మౌళిం గోహళి సంఘటించినక్రియన్ మధ్యాహ్న వేళన్మహా
కాళంబైన నభోవిభాగమున వీఁకంగాసె బీరెండయా
ప్రాలేయాహితసంప్రదీప్తకిరణ ప్రక్రీడ దర్కోపల
జ్వాలాజాలజటాలజాంగలతటీ వాచాలకోయష్టియై.
హర. ఆ. 7, ప 109.
పయి పద్యమున 'కోహళి' కర్థమెఱుఁగరాదు. 'ఆలవట్టము' కాని, 'ఉల్లడ' కాని కాఁదగు ననుకొందును. నాచనసోమన కూడ నీ పదమును బ్రయోగించెను. 'పార్వతీపతికిఁ బ్రభాతభూపతి గొన్నయలరుఁ గెందమ్మి కోహళి యనంగ - భానుబింబంబు కన్నుల పండు వయ్యె' - ఉ. హరి. ఆశ్వా. 3. ఇక్కడఁ గూడఁ బై యర్థములే సంగతము లగును. సంస్కృతాంధ్ర