Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

157


కిరాతార్జునీయము

భారవి రచించిన కిరాతార్జునీయకావ్యపుఁ గథయే యిది. కాని, నా చూచినంతలో నా కావ్యమునకు దీనికి సంబంధము కానరాలేదు. భారతారణ్యపర్వమునఁ గల కథాసంక్షేపమున కిది విస్తృతి. శ్రీనాథుని కవితాశయ్య యీ యాశ్వాసమున మిక్కిలి నిగనిగలు దేరి యున్నది. ఈ యాశ్వాసమొక్క స్వతంత్రసత్కృతి యనఁదగినది. ఇంద్రుఁగూర్చి యర్జునతపశ్చర్య వృద్ధబ్రాహ్మణ వేషమునఁ జేరవచ్చి యింద్రుఁ డర్జునునితో సంభాషించుట, శివునిఁ గూర్చి తపస్సుచేయు మని బోధించుట, శివునిఁ గూర్చి యర్జునుని తపస్సు, శివకిరాతవేషము, వరాహహననము, అర్జునకిరాత వివాదము, పరస్పర యుద్ధము, ఈశ్వరసాక్షాత్కారము, పాశుపత వరప్రదానము, అర్జునస్వర్గయాత్ర, ఊర్వశీదర్శనము, అర్జునోర్వశీభాషణము, అర్జున నిర్మలశీల సౌభాగ్యము, ఊర్వశి యవమానపాటు, శాపప్రదానము, అరుణోదయాది వర్ణనము, నివాతకవచాదుల విజయము, ఇంద్రసత్కారము నను విషయ విభాగములు గలదై యీ యాశ్వాస మీ గ్రంథములోని యన్ని యాశ్వాసముల కంటె గొప్పదై యొప్పు మీఱి యున్నది. ఇందు అర్జునోర్వశీ సంవాదమౌచితీ రుచిరమై మనోహరముగా నున్నది. శ్రీనాథుని గ్రంథములనుండి కండపట్టనఁదగిన కథపట్టును దెలిఁగింపు గానిదానిఁ బేరుకొనఁ గోరుకొందుమేని యీ కిరాతార్జునీయమే యందుకుఁ దగినది.

ఇందీ పద్యములు చాల హృద్యములు - 5, 7, 8, 9, 19, 22, 29, 30, 31, 32, 33, 34, 35, 41, 43, 44, 46, 55, 59, 63, 65, 68, 69, 77, 79, 86, 89, 90, 99, 100, 111, 119, 120, 124, 125, 129, 132, 135, 137, 139, 141, 144.

హరవిలాసము శ్రీనాథుని తక్కిన గ్రంథములన్నిటికంటె మృదుమధురరచనము గలది. బహుప్రౌఢ సంస్కృతపదఘటనలు, అన్వయక్లేశములు కారక ప్రయోగవైచిత్యములు - భాషాంతరీకరణము లగుటచే శ్రీనాథుని యితరగ్రంథములలో నధికములైయున్నవి. ఇందంత గానరావు. శ్రీనాథుని రచనల లోతుపాఁతుల సక్రమముగాఁ నెఱుఁగఁ గోరువారు హరవిలాసోప