156
హరవిలాసము
- చతుర్థాశ్వాసము.
దారువన విహారము
సంస్కృతమున నుత్ప్రేక్షావల్లభుఁ డనుకవి యీ దారువన విహారమును 'భిక్షాటనకావ్య' మను పేర సవిలాసముగ వర్ణించెను. అది శృంగారరసపూరిత మగునుచ్ఛృంఖలకావ్యము. ఆ కావ్యమునకును శ్రీనాథుని యీ రచనకును సంబంధము లేదు. పరమశివలీలయగు నీ కథాఘట్టమున నౌచిత్య చర్చ జరుపుట సంగతము గాదు. ఐనను శ్రీనాథుఁడీ కథారచనలో నౌచితినంతగాఁ గోల్పోవకుండుట ముదావహము.
ఇందీ సంఖ్యల పద్యములు చాల హృద్యములు - 5, 10, 14, 16, 20, 24, 30, 32, 33, 34, 35, 38, 39, 41, 56.
'ఎంచి నుతింప శక్యమె యహీశ్వరు నంతటివానికైన' ఇత్యాదిక మగుహరవిలస పంచమాశ్వాస పద్యము పిల్లలమఱ్ఱి పినవీరన శృంగార శాకుంతలమునఁ గూడఁ గానవచ్చుచున్నది. నిజముగా దాని రచయిత యెవ్వరో యా యిద్దఱిలో ?
సముద్రమథనము, హాలాహలభక్షణము
శ్రీనాథుఁ డీ కథను భీమఖండరచనానంతరమే రచించినట్టు గుర్తింపనగును. సముద్రమథనారంభమున దేవాసురులు విఘ్నేశ్వరపూజ సేయుట సంస్కృతభీమఖండమునఁ గలదు; తెలుఁగు భీమఖండమునను గలదు. ఈ సందర్భము భాగవతాదిపురాణములలోనిది గాదు. హరవిలాసమునఁ గూడ నీ విఘ్నేశ్వరపూజాప్రకరణ మున్నది. దీని యునికి భీమఖండ కథాసందర్భానుకరణమే యనుకొందును. మఱియు సంస్కృత భీమఖండశ్లోకపుఁ దెనుఁగు సేఁత కందపద్యము భీమఖండమం దున్నది. ఆ పద్యమే యీ హరవిలాసము నను నున్నది. ఇందు హాలాహలభక్షణము, సముద్రమథనము వడి గల కథాగతితో నున్నవి.
ఇందీ పద్యములు హృద్యతరములు -40, 44, 45, 56, 60,62, 66, 68, 77, 117, 127, 131.