Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

149


“జగదేక ప్రశంసార్హ చరిత్ర కలశోద్భవ
క్షోణీవతంసభూషాయాః కాశ్యా విరహకారణాత్
త వాస్యాః కోమలాంగ్యాశ్చ మమాప్యార్తి రజాయత
త్రీ నేతాన్ యోజితవతో దేవస్య ను కృపా న కిమ్.”


జక్కన విక్రమార్కచరిత్రలోని పద్యమునఁ గూడ శ్రీనాథుని యీ సంస్కృతానుసారి పద్యచరణానుకరణము గానవచ్చుచున్నది. మంచి పలుకుబడి తీరున శ్రీనాథుడు చేసిన “త్రీ నేతాన్ యోజితవతో దేవస్య ను కృపాన కిమ్” అనుదాని తెలుఁగు సేఁతను జక్కన యనుకరించె ననవలెను. శ్రీనాథుఁడె సంస్కృతభీమఖండమును గూడ రచించియుండు నన్నట్టు నే నిలువఁజాలక పోవును. విక్రమార్క చరిత్రపద్య మిది:


చిగురాకు న్నునుగెంపు లేఁదొడవు లి
            చ్చెం జిత్తజుం డంచు లో
నగు నీలాగు ఋణంబు వీరలకు నె
            న్నం డబ్బె నమ్మా యను
దగుఁబో వీరికి నాకు సంగమము పో
            నాపాలిభాగ్యం బనున్
ముగురన్ గూర్చినముండదైవమునకున్
            మ్రొక్కంచు జెజే యనున్.
                                 (మదనదహనము... గౌరీకల్యాణము)


ప్రథమ ద్వితీయాశ్వాసముల (చిఱుతొండనంబి కథ) రచనమున కంటె నీ తృతీయ చతుర్థాశ్వాసముల కవితారచన ప్రశస్తతరముగానున్నది. తృతీయాశ్వాస కథ మదనదహనమును, దర్వాతి యాశ్వాసకథ గౌరీకల్యాణమును, కాళిదాసుని కుమారసంభవమహాకావ్యమున కించుమించుగాఁదెలుఁగు సేఁత యనఁదగినట్టు శ్రీనాథుఁడు రచించినాఁడు. కాని, కాళిదాసు కుమారసంభవములోని కథాక్రమ మిందుఁ గొంత మార్పు సెందినది. శ్రీనాథుని గ్రంథము లెల్లఁ బ్రాయికముగా నాంధ్రీకరణములే యైనను, నా యాంధ్రీకరణము సంస్కృతపు హద్దుపద్దులలో నుండక శ్రీనాథుని యిచ్చకు