Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

147

నీ చమత్కృతి గానరాదు. మఱియు హరవిలాస రచనమందుఁ కథార్థము కరుణాద్భుతరసోల్బణముగాఁ గడు విపులముగా నున్నది. ఏ తత్కథాఘటితములైన ప్రథమ ద్వితీయాశ్వాసములే యొక స్వతంత్ర ప్రబంధ మనఁదగును.

మఱియుఁ బ్రథమాశ్వాసములోని దగునొక పద్యమును బిల్లలమఱ్ఱి పినవీరన శృంగారశాకుంతలమున ననుకరించినాఁడు --


మ. ఖుషిమీఁదన్ సురధాణి నిండుకొలువై
               కూర్చున్నచో నీ కరా
     భ్యసనప్రౌఢి నుతించు రా యవచితి
               ప్పా! చంద్రసారంగ నా
     భిసముత్పాదిత తాళవృంతపవన
               ప్రేంఖోలన ప్రక్రియా
     వసరోదంచిత సారసౌరభరస
               వ్యాలోలరోలంబముల్
                                             --హరవిలాసము.

మ. విసరన్ జూడకు రమ్మ పూవుసురఁటుల్
               విశ్రాంతిమూలంబుగా
     ననువు ల్వావుఁ దదంతరాంతరనితాం
               తామోదహేలాలతాం
     తనమాక్రాంతకృతాంతరూపపవమా
               నప్రేంఖనప్రక్రియా
     వసరోదంచిత సారసౌరభరస
               వ్యాలోలరోలంబముల్
                                  శృంగార శాకుంతలము. ఆ. 3.


మఱియు ద్వితీయాశ్వాసపద్యము నొకదాని జక్కన విక్రమార్క చరిత్రమున ననుకరించెను.


ఉ. తూనిఁగ లాడఁజొచ్చె దివి
               ధూళి భ్రమింపఁగఁ జొచ్చెఁ బిచ్చుకల్
    మానక యుబ్బి గబ్బులుఁగు