వేటూరి ప్రభాకరశాస్త్రి
141
క. కంటిఁ బ్రవిశుద్ధసంతతి
వింటిఁ బురాణములు పెక్కు విశ్వము పొగడన్
మంటి బహువత్సరంబులు
కొంటి యశోధనము సుకవికోటులచేతన్.
హరవిలాసము అవతరణిక.
అతని బాలసఖుఁడగు శ్రీనాథుఁడును హరవిలాస రచనమునాఁటికి వృద్ధుఁడే. కాని, శ్రీనాథుని కంటెను నవచితిప్పయ మఱీ వృద్ధుఁడు. అవచితిప్పయ కాంచీపురనివాసి. శ్రీనాథుఁడు కాంచీపురి కరిగి యక్కడ నీ
గ్రంథమును భీమఖండరచనానంతరము కాశీఖండరచనముకుఁ బూర్వము రచించి యుండును. హరవిలాస కృత్యవతరణికాపద్యములు, కాశీఖండమున 'కంచి యఱవత లసమాన్త్రుఖడ్గలతలు' అన్న పద్యమును నాతని కాంచీపురీ పరిచయము నెఱిఁగించుచున్నవి.
రెడ్డిరాజ్యారంభకాలమునాఁటనుండియును నవచి తిప్పయవంశమువారు ద్వీపాంతరములతో వ్యాపారము జరపుచు, రెడ్డి రాజుల కత్యాప్తులయి యుండిరి. అద్దంకికిని గొండవీటికిని జేరువుగాఁ దూర్పుసముద్రము నొడ్డునఁగల ముకుళపురము (మోటుపల్లి) ఓడరేవుద్వారమున ద్వీపాంతరములతో వ్యాపారము వారు జరుపుచుండెడి వారు.
శ్రీనాథుని బాలసఖుఁడగు నవచితిప్పయ క్రీ. శ. 1390 నుండి 1404 దాఁక రాజ్యమేలిన కొమరగిరి నృపాలునివలన 'ఆందోళికాచ్ఛత్ర చామరతురంగభద్ర పీఠాది రాజ్యచిహ్నములు' వడసెను. అమ్మహారాజునకుఁ బ్రతివత్సరంబును సంవత్సరోత్సవంబులకుఁ దగిన 'కస్తూరీ కుంకుమకర్పూర సంకుమద హిమాంబు కాలాగురుగంధసార' ప్రధానము లగు సుగంధద్రవ్యము లొడఁగూర్చుచుండువాఁడు. మఱియు నాతఁడు 'చీని సింహళ తవాయి హురుమంజి జోణంగి ప్రభృతి నానాద్వీప నగ రాకరములగు ధన కనక వస్తువాహన మాణిక్య గాణిక్యములను' దెప్పించి యిచ్చువాఁడు. మఱియు,
సీ. పంజారఁ గర్పూరపాదపంబులు దెచ్చె
జలనోంగి బంగారు (పన్నీరు?) మొలకఁ దెచ్చె