ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వేటూరి ప్రభాకరశాస్త్రి
137
పాఠభేదములఁ గూర్చుటలో నా వలనఁగాని ముద్రణమున నచ్చు చిత్తులఁ జూచుటలో ముద్రాలయము వారి వలనఁగాని యేవేని దోషము లిందు దొరలి యుండవచ్చును. 'నడచుచునుండు వాని చరణంబులకేకద రాళ్ళ తాఁకుడుల్' అను న్యాయము నెఱిఁగి యిందుఁ బొడకట్టు తప్పిదములను సహృదయులు క్షమింపఁగలరు.
- వేటూరి ప్రభాకరశాస్త్రి.
( నాచన సోముని ఉత్తరహరివంశమునకు పీఠిక - ముద్రణము 1939; 1926; 1913)