వేటూరి ప్రభాకరశాస్త్రి
133
మన నాచనసోమన తెల్గుహరివంశమునకు మూలమయిన సంస్కృత హరివంశమున్నదేమో యెఱుఁగరాదు. ఇప్పుడు ముద్రితమయియున్న హరివంశమునకు నీ తెల్గునకు మిక్కిలి భేదములున్నవి. అందలికథలు పెక్కులిందు జేరనేలేదు. ఉన్న కథలు గూడ వెనుకముందులుగా నున్నవి. సంస్కృత హరివంశమున హంసడిభక కథ గ్రంథాంతమందున్నది. ఇందు చతుర్థాశ్వాసమున నున్నది. సంస్కృతమున హంసడిభక కథకు మిక్కిలి పూర్వ మందున్న బాణాసురకథ తెల్గునఁ గట్టకడపటిదిగానున్నది. మూలముననుండి కొన్ని కథలను మాత్రమే కయికొని సోమనాథుఁడు తర్వాతి ప్రబంధరచనకు మార్గదర్శకముగా నవీనగుణనాథుఁడై యీ హరివంశము నిచ్చమెచ్చునట్లు రచించి యుండునని నేను దలఁచుచున్నాఁడను.
నన్నయభట్టారకుని ధారాశుద్ధియును, తిక్కన భావగాంభీర్యమును గలయికఁజెంది మన సోమనాథుని కవిత నాశ్రయించిన వనవచ్చును. కొన్నిచోట్ల శయ్యాసౌభాగ్య మతిమాత్రమై యర్థంపుసొంపును గొంత కొఱఁత పఱిచిన దనియు ననఁదగియున్నది.
మ. గనయంబుం గొనయంబు నెన్నడుముతో గర్ణావతంసంబుతోఁ
జనుదోయిం గనుదోయి సాయకముతో సంధానహస్తంబుతోఁ
జెనకం జేయుచు నేయుచుండె సతి లక్ష్మీభూతదైతేయ త
ర్జన గర్ణారవ జర్జరాంగ రుధిరాసారంబుతోరంబుగాన్
శా. ఈ రూపంబున సంస్కృతిందొఱఁగి మీరేచింతలం జెంతలం
జేరంగోరక యూరకున్న నిట విచ్చేయంగఁజేయుం గడుం
బారం బేదని వంతయుఁగలిగెనే బాలార్కబింబంబులో
నారంగూరిన యంధకారమన నాహా సాహసంబెట్టిదో !
చతుర్ధాశ్వాసము.
శా. ధారాస్ఫారకృపాణబాణ పటలీధారాహతిం దచ్చతు
ర్ధారీశోణితఫాణితద్రవనిపీత ప్రీతులై తన్నుఁ జె
న్నారం బన్నగయక్షరాక్షసు లమర్త్యవ్రాత చేతస్స్ఫురత్
స్ఫారస్ఫోరవిహార ఘోరనటనా ఝాటస్ఫుటాటోపులై.
షష్ఠాశ్వాసము.