130
ఉత్తరహరివంశము
కాని, దొరతనము వారి పరిశోధనలవలన బుక్కరాయలు శక 1274 నాఁటికి రాజ్యమునకు వచ్చినట్టును నంతకుఁ బూర్వమాతని యన్న యగు హరిహరరాయలు రాజ్యమేలుచున్నట్టును దెలియవచ్చును. రాజ్యమునకు రాక పూర్వము బుక్కరాయలు దానము నెట్లుచేయఁగల్గునని యొక యాక్షేపమున్నది. దీనికిట్లు సమాధానము చెప్పవచ్చును.
ఎపిగ్రాఫికాకర్ణాటికా వాల్యుం 5. హసన్ జిల్లా చెన్నరాయపట్నం తాలూకా శాసనము నె. 256లో హరిహరరాయలు రాజుగానున్నను, వాస్తవమునకు విద్యానగరమును నిర్మింపఁ జేసినవాఁడు, పేరుపెట్టినవాఁడు బుక్కరాయలే యనియున్నది. అన్న హరిహరుఁడు రాజుగానున్నను సర్వసమర్థుఁడయిన తమ్ముడు బుక్కరాయఁడు యువరాజుగానుండుటచే నిట్లుదానశాసనము వెలయింపదగినవాఁడే యగును. ఇదియొక గొప్పయాక్షేపము గాదు.
ఇట్లు చూడఁగా నాచనసోమన క్రీ. 1344లో నున్నవాఁడగుచున్నాఁడు. ఎఱ్ఱాప్రెగ్గడకంటె నీతఁడు ప్రాచీనుఁడు గాఁడు. సమకాలమువాఁడుగాని యించుక తర్వాతివాఁడు గాని యగును.
బిరుదములు
సకలభాషాభూషణ, సాహిత్యరసపోషణ సంవిధానచక్రవర్తి, నవీనగుణసనాథ బిరుదముల నీతఁడు హరివంశగద్యమందు చెప్పికొన్నాఁడు. చిన్నయసూరిగారు 'అలికంబున యక్షినిడాఁచినట్టి సర్వజ్ఞుఁడని యీతనిఁ బ్రస్తుతించిరి. అది మొదలుగాఁ గొంద ఱీతని సర్వజ్ఞబిరుదాంకుఁడనుచున్నారు.
ఉత్తరహరివంశము
ఇప్పుడుపలబ్దమై ప్రకటితమైయున్న యీ యుత్తర హరివంశమునే కాక, పూర్వహరివంశమునుగూడ నీతఁడు రచించి యుండవచ్చునని కొందఱందురు. రచించెనని కాని, లేదనికాని, యొత్తిపలుకుటకుఁ దగిన యాధారములు గానరావు. ఇందు గ్రంథావతరణిక గానరాకుండుట, పూర్వభాగకథాను స్మరణముండుట, పూర్వహరివంశమునుగూడ నీతఁడు రచించియుండుటకు హేతువులందురు. బ్రహ్మశ్రీ నడుకుదుటి వీరరాజుపంతులుగారిట్లు వ్రాసినారు.
"సోముడు పూర్వహరివంశమును రచించిన ట్లొండు రెండు నిదర్శ