Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

బాలభాష

పలుకుబళ్ళను, వాని సంగీతచ్ఛాయలను, పాటలను, బదములను, బద్యములను జక్కఁగాఁ జదువ నేరకున్నారు.


కంచికిపోతావా కృష్ణమ్మా !
               ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
               ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
               నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి యింటిది అప్పు;
               ఆ - అప్పు నాకుపెట్టు పప్పు.
పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
               నీకు - కూర యెక్కడిదోయి కృష్ణమ్మా?
దొడ్లోను ఉన్నది బీర;
               ఆ - బీర నాకు పెట్టు కూర.
కూర ఉన్నది కాని కృష్ణమ్మా,
               నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి అక్కెమ్మ చెయ్యి;
               ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.
నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;
               నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
ఉన్న యింటి యిరుగుపొరుగు,
               ఆ - పొరుగు నాకు పోయు పెరుగు,
బువ్వ తిందువుగాని కృష్ణమ్మా,
               నీకు ఆ- వూళ్ళో పనియేమి కృష్ణమ్మా?
అక్కడ ఉన్నది అమ్మ,
               నేను మొక్కివత్తును కామాక్షమ్మ.


ఈ పదము 'కృష్ణమ్మ' అని ఎత్తు పలుకు గలిగి బువ్వ, పప్పు, కూర, నెయ్యి, పెరుగు, అను భోజన పదార్థముల వరుసతోను, వరుసగా