వేటూరి ప్రభాకరశాస్త్రి
123
శ్రీరామ లక్ష్మణులు గోవిందా రామ,
చెలులతో గూడుకొని గోవింద.
పన్నెండు వర్షములు గోవిందా రామ,
ప్రమదముతో ఉండిరీ గోవిందా.
దశరథుఁడంతటను గోవిందా రామ,
తగ వసిష్ఠునిజూచి గోవిందా.
-ఇత్యాది.
తుమ్మెద పదాలు, కోవెల పదాలు, చందమామ పదాలు, బాలనాగమ్మ కథ మొదలయినవి యిట్టివే.
దశరథు డనుపేర తుమ్మెదా
ఒక్క
ధరణీశు డున్నాడు తుమ్మెదా
ఆ
ధరణీశునకు తుమ్మెదా
నలుగురు
తనయూలున్నారు తుమ్మెదా !
-ఇత్యాది.
వీనిలో ఎత్తు పలుకులు విడిచితిమేని మిగిలినది సరిగా సాధారణముగాఁ జదువఁ దగిన వచనముగా నుండును. యతిప్రాసముల సంగతికై రవంత రచనాప్రయత్నము కావలెను గాని, యిట్టి రచనలలోని కేవచనమును గాని సులువుగా విఱుగఁదీయవచ్చును. యతిప్రాసములు, తాళలయాన్వితమగు గణబంధము పొసగుటచే నివి చదువునప్పుడెంతో హృదయంగమములుగా నుండును. ఆంధ్రభాషకు సహజాలంకారము లయిన యతిప్రాసములు, సంగీతచ్ఛాయ, బాలరచనములందు గానవచ్చుచున్నవి. అట్టి రచనములను బాలకులు పాలమీఁగడ చవితోఁ జదువఁగలవు. ఈ యింపునెఱుఁగక పోవుటచే నిప్పటి బాల పాఠగ్రంథ రచయితలు “ఇదిగో
ఆవు. దీనికి నాలుగుకాళ్ళు గలవు". ఇత్యాది విధములఁ బొల్లు మాటలతోనే పాఠములల్లి బాలకుల విసిగించుచున్నారు. బాల్యమం దిట్టి సముచిత సంస్కారముఁ బడయక పోవుటచే నిప్పటిబాలురు మంచి మంచి తెలుఁగు