Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

బాలభాష


పంతులు పంతులు
పావుసేరు మెంతులు,
కూర్లోకి చాలవు
గుప్పెడు మెంతులు.
పంచా యొక్కం పంచా,
పంతుల్నేసి దంచా;
రోట్లో వేసి రుబ్బా,
రొట్టె గాల్చుకు దొబ్బా !!


బడిబాలురే కదా యీ దుడుకుఁ గవిత్వమునకుఁ గర్తలు; యతిప్రాసముల మెలపే కదా పయి రచనములకుఁ జెప్పఁదగిన యర్థము.

తెలియవలసిన విషయ మెంతయుఁ దేలికైన భాషలో, అందును వచనములో నున్ననుగూడ, నది వాక్యముపై వాక్యముగా నెడతెగకుండఁ దీగసాగుచున్నపుడు బాలురు, పామరులు వెంటాడుచు దాని యర్థము నందుకొనఁ జాలకుందురు. ద్రవరూపముననున్నను ఉగ్గుఁబాలను ధారగా బోయుచున్నచో బాలురు త్రాగఁజాలరు. గ్రుక్కెడు గ్రుక్కెడు చొప్పున నాచియాచి పోసినచోఁ ద్రాగఁ గల్గుదురు. అట్లయిన నాత్రాగినదియుఁ జక్కఁగా నిముడును, అట్లే తెలియవలసిన విషయమునుఁగూడఁ ద్రుంచి త్రుంచి యించించుకగాఁజేసి, నడుమ నడుమ, విశ్రాంతికై యెత్తుపలుకును గూడఁ జేర్చి చెప్పినచో బాలురు తేలికగాఁ దెలిసికొనఁ గల్గుదురు. అప్పుడు దాని యర్థమును తలలో వాండ్రకుఁ జక్కఁగా నెలకొనును. అంతేకాక, యది యించుక తాళలయానుగుణముగా గణబద్దమై యుండుటచేఁ జిత్తరంజకమై మరవరానిదై కూడ నుండును. హెచ్చుగా బాలురయు, పామరులయు వాఙ్మయ మీ విధముగాఁ గానవచ్చుచున్నది.


రామన్న రాముడోయి రామభజనా,
రాముడొస్తున్నాడు రామభజనా.
పూలారథము నెక్కి రామభజనా,
వూరేగుతున్నాడు రామభజనా.
                                             -ఇత్యాది.