వేటూరి ప్రభాకరశాస్త్రి
119
దోపించుచున్నది. గోల్కొండ మ్యూజియము నందలి విగ్రహమున నక్క స్వరూపము విస్పష్టముగా నున్నది. దానికిని దీనికిని పోలికలేదు. ఏమైనను బరిశోధకు లింకను జాగ్రత్తగాఁ బరిశీలించి యీ విషయమును గూర్చి సత్యము వెల్లడింతురు గాకని కోరుచున్నాను.
చేర్పులు, కూర్పులు
పూర్వముద్రణము కన్న నీ ముద్రణము విషయ వివరములతోఁ బరిశీలనమున కనుకూలముగా నుండవలె ననుతలఁపుతో కొన్ని మార్పులను కూర్పులను అచ్చులోనికిఁ దెచ్చితిని. ఈ ముద్రణమును సాగించు సమయమున నేను ఓరుగల్లులోనుండిన భాగ్యమున మిత్రులు సాహాయ్యమున నిందు పొందుపరచిన విశేషములు కూడా మరికొన్ని కలవు. చిత్రపటములు సేకరించితిని. ఓరుగల్లుకోట పునాదుల ప్రణాళికను వ్రాయించితిని. కథానాయకు లేయే ప్రాంతములఁ బర్యటించిరో పరిశీలించి యిందు గుర్తించుటకు యత్నించితిని. వానిలో నేడును దుర్గమున గుర్తింపదగిన ప్రదేశములు రెండుమూఁడున్నవి. 1. కేశవ స్వయంభూదేవాలయము. 2. మాచల్దేవి దిబ్బ. 3. వీరభద్రాలయము - ఇప్పుడీయాలయము లేదుగాని బావి మాత్రమే సర్వే పటములలో గుర్తింపఁబడియున్నది. 'వీరభద్రేశ్వర స్థానంబు వెనుక నున్నట్లు పేర్కొనబడిన బొడ్డన బావి' (చూ. 273వ) యిదియే యనుకొందును. దుర్గమునందలి శిథిలములలో కాననైన నర్తకి శిలాప్రతిమకు ఛాయాపటమును సేకరించితిని. బెజవాడ శాసనశిల యందలి మాచల్దేవి చిత్రమును గూడ పరిశీలనమునకై వ్రాయించి జతపరిచితిని.
అప్పుడు ఓరుగల్లు నగర మెంత వైభవముతో నుండెడిదో నేడంతయుఁ బాడుపడి పోయినదికదా! ఈ క్రీడాభిరామమేని దానిని బునరుద్ధరించు గాక!
దీపావళి
విద్వద్విధేయుఁడు
20-10-1960
వేటూరి ఆనందమూర్తి