వేటూరి ప్రభాకరశాస్త్రి
107
మోపూరు ప్రాంతము వారైనప్పటికిని చంద్రామాత్యుని కాలము నుండియు విజయనగరరాజులకడ వర్తిల్లుటను బట్టి స్థిరనివాసముగ నేర్పరుచుకొన్న వినుకొండతో వీరి సంబంధము తెగియుండదు. ఇట్లు వినుకొండ వారుగాఁ బ్రఖ్యాతిఁ గాంచిన కుటుంబము లోనివాఁడగు వల్లభరాయని శ్రీనాథుఁ డాదినములలో విను కొండలో గాని, మోపూరులోగాని, దర్శించి యుండును. అప్పుడే మోపూరు భైరవస్వామికి జరుగు తిరునాళ్ల సందర్భమున ప్రదర్శన కనుకూలముగ వల్లభరాయనిచేత నిర్వహింపఁబడిన యీ రూపకము శ్రీనాథునిడెందమున కెక్కియుండును. వల్లభరాయని ప్రేరణమున క్రీడాభిరామముగా జాలువారి యుండును. విషయమును ముందు వివరింతును. ఈ గ్రంథమందలి రచనా సందర్భమును బట్టి యిది శ్రీనాథుని భీమఖండ రచనమునకుఁ దర్వాతను, కాశీఖండరచన కించుక పూర్వమో లేక తరువాతనో రచియింపఁబడి యుండునని భావింపవచ్చును.[1]
కర్తృత్వము
క్రీడాభిరామ కర్తృత్వమును గూర్చి చర్చలు. తర్జన భర్జనలు నేటిదనుక చాలా జరిగినవి. నా యభిప్రాయ మిట్లున్నది. నేడు మన కుపలభ్యమగుచున్న క్రీడాభిరామమనఁబడు వీధినాటకప్రబంధము రచనాసందర్భమును బట్టి శ్రీనాథఁ రచనమని నొక్కి చెప్పుట కెట్టి సందియము నక్కరలేదు. లాక్షణికుల యుక్తికూడా నట్లేయున్నది. కాక, గ్రంథమందలి ప్రతిపదము నా విషయమును చాటుచునే యున్నదని శ్రీ ప్రభాకరశాస్త్రిగారు విపులముగా నాయా విషయముల నెల్ల తమ పీఠికలో విశదపరచియే యున్నారు. ఇట్లీ గ్రంథమందలి
- ↑ చూ. కాశీఖండము 7-230 పద్యమున నీ క్రీడాభిరామమును స్మరింపఁజేయు వివరము లున్నవి.
“గొరగయై మైలారుఁ గొనియాడు నొకవేళ
నొడలిపై బండారుపసుపుఁ బూసి
ప్రణుతించు నొక్క (?) వీరాదేవి నొకవేళ
బవనీఁడయి సమగ్రభక్తి గరిమ”
(ఇందు “నొక్క" యని కాక “నేక” యని యుండునేమో?)