వేటూరి ప్రభాకరశాస్త్రి
101
వ. అందు
సీ॥ తారకామందార తారాచలంబుల
తో రాయు నెవ్వాని చారుకీర్తి....
మర్త్యమాత్రుండె వల్లభామాత్యవరుఁడు.”
(క్రీడా. 10,11,12.)
ఇట 'అందు' అనఁగా నైదుగురు సోదరులలోను మొదటివాఁడగు వల్లభుని అని. అతని వర్ణనము సీసములో నున్నది. అన్వయమొకే విధమున జక్కగాఁ బ్రథమలో పద్యమున దుదిఁ దాకుచున్నది. ఇట్లే ప్రస్తుతభాగమున గూడ నన్వయము.
“.... తిప్పన యఖండిత దీనిధికాంచెఁ బుత్రులన్
బాంధవ కల్పవృక్షముల బైచన మల్లన (?) తిప్పమంత్రులన్.”
వ. అందు
సీ॥ 'మూఁడు గ్రామగ్రాసముల' (22 పద్యము)
ఈ సీసమున దొలి నాలుగుచరణములలో నున్న విశేషములన్నియు 'నెవ్వ' డను శబ్దముచే ప్రథమావిభక్తిలో వర్జితుఁడైన వల్లభునకే చెల్లును. ఇక, పై వచనమున 'అందు' అనుట 'బైచన మల్లనఁ (?) తిప్పమంత్రు'లలో ననుటకు. కాని, యందు వల్లభుఁడు కానరాఁడు. అందుకే “మల్లన” అనికాక 'వల్లభ' అని యుండఁదగునని శ్రీ శాస్త్రిగారి సంస్కారము.
2. ఇందలి రచనా సంప్రదాయ మిట్లుండగా నెట్లో విమర్శకులు చెప్పిన చొప్పున పై (22) పద్యమున కన్వయము గల్పించు కొందమన్నను జిక్కులు తప్పకున్నవి. "బైచన మల్లన తిప్పమంత్రు" లలో నెవఁడు “మూడు గ్రామ గ్రాసములతోడఁ గూడంగ మోపూరుఁ బాలించెనో ఆ త్రిపురాంతకాధీశ్వరునకు "ప్రియతనూజుండు చందమాంబికకు సుతుఁడు” “వల్లభామాత్యవరుఁడు మనుజమాత్రుండె” అని ప్రథమనుండి షష్ఠికి విశేషణ విశేష్యములను కప్పదాటుగా నన్వయించుకొనవలసి వచ్చును. ప్రాముఖ్యమునుబట్టి యీ అర్థమున బద్యమెల్ల రెండు ముక్కలగుచున్నది. అది యీ సీసపద్య రచనా సౌభాగ్యమును గుంటువడఁజేయుచున్నది.