Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠికానుబంధము -

క్రీడాభిరామము

వల్లభరాయని పేర శ్రీనాథుఁడు చెప్పిన వీధినాటక ప్రబంధమున వల్లభుని ప్రశంస 'మూడు గ్రామగ్రాసముల తోడఁ గూడంగ మోపూరుఁబాలించే ముల్కినాట.... మనుజమాత్రుండె వల్లభామాత్యవరుఁడు' అను సీసపద్యము (క్రీ. 22)న గలదు. అందు తొలి నాలుగు చరణములందును గ్రియాన్వితములుగాఁ జెప్పఁబడిన విశేషము లన్నియు నా సీసపుటెత్తుగీతిని యత్తదర్థక శబ్దములచేత సూచితుఁ డగు వల్లభామాత్యునకే యన్వితములగుట శ్రీనాథుని సీసపద్య రచనా సంప్రదాయము. ఆ త్రిపురాంతకాధీశ్వరునకు, భండార రక్షకునకుఁ బ్రియతనూజుండు చందమాంబికకు సుతుఁడునయి యెవడు - పాలించెనో, పఠించెనో, వరించెనో, వార్తకెక్కెనో - ఆతఁడు వల్లభామాత్యవరుఁడు మనుజమాత్రుండె అని యన్వయమగును. శ్రీనాథుని సీసపద్యమున నన్వయమిట్లు విస్పష్టముగా నున్నను గొందఱోలకో పై వాక్యములన్నియు వల్లభుని తండ్రియగు తిప్పనకే చెల్లునని భావించిరి. అది యట్లన గాదు (చూ. పీఠిక పుట 20) క్రీడాభిరామమందలి 2,22 పద్యముల బోలినదే కాశీఖండమున నీ సీసపద్యమును గూడ బరికింపుఁడు.


సీ॥ మాటలాడుచు మూత్రమలము లుత్సారించు
            మిహిరోదయమ్మున మేలుకొనఁడు
      సంధ్య వార్వఁడు మంత్ర జపసంయుతంబుగ
            విడికచ్చతోనుండు విడువ కెపుడు
      బ్రహ్మసూత్రము ధరింపఁగ సిగ్గువహియించుఁ
            జల్దియోగిరము నిచ్చలు భుజియించు
      ఋతువేళలఁ బరిగ్రహింపఁడు నిజభార్య
            నన్యకళత్రంబు నభిలషించు

గీ॥ నెవ్వఁ డవ్విప్రదాయాదుఁ డేగుదెంచె
     మార్గవశమున భాగ్యసామగ్రి కలిమి
     నాశ్రయించితి నతని మధ్యాహ్నవేళఁ
     బ్రాంతదేశంబునం దొక్కరావినుండి ( కాశీ 6-46)