94
క్రీడాభిరామము
పెనుంబాకను పుట్టెండు క్షేత్రమున్ను, గొల్లపూండిని పుట్టెండు క్షేత్రమున్ను. నరసూరు గ్రామానను పుట్టెండు క్షేత్రమున్ను, నున్నగ్రామాన పుట్టెండు క్షేత్రమున్ను, గుడుదల గ్రామాన పుట్టెండు క్షేత్రమున్ను, వెనకపల్లి గ్రామాన పుట్టెండు క్షేత్రమున్ను యీ పదిగ్రామాల కేసరిపాటి పదిపుట్ల క్షేత్రమున్ను పృథి లింగల గోత్రమువారికి పుణ్యంగాను ధారవోసి యిచ్చిన ధర్మశాసనం మంగళ మహాశ్రీం జేయును.
(చూ. శృంగార శ్రీనాథము (1923) పుట. 276-277)
దోహరి
క్రీడాభిరామమున “...దాత్యూహ వ్యూహంబులుం గలిగిన మోహరివాడ యందు...” “కొలుచును జేనవెట్టి" ఇత్యాది పద్యము కుట్రపువాని వర్ణనముతో నున్నది. దానిఁ బ్రకటించునాఁడు మోహరివాడ యనఁగా నా కర్థము తెలియదయ్యెను. "యుద్దభటు లుండువాడ యనుకొందును -" అని పీఠికలో వ్రాసితిని. మోహరము = యుద్ధవ్యూహము అర్థముండుటను బట్టి యట్లను మానించితిని. ఇటీవలఁ దెలియవచ్చిన క్రొత్తయర్థము :
కాశీఖండము సప్తమాశ్వాసమున
సీ॥ ప్రార్థింప నున్నాఁడు పాదాగ్రముల వ్రాలి
వెలివాడవాఁడు తద్విప్రకులుని..
ఇత్యాది పద్యమున,
దీవింప నున్నాఁడు తెలిసి దోహరిబంటుఁ
జెవి నక్షమాలికఁ జెరివి ద్విజుఁడు (7-240)
అన్నచోట 'దోహరిబంటు' ఉన్నాఁడు. ఈతఁ డిక్కడ మరియు చండాలుఁడు - వెలివాడవాఁడు అనియుఁ జెప్పఁబడినాఁడు.
మఱియు నాముక్తమాల్యదలో, " అనినఁగహకహ నవ్వి యద్దోహరికి సురద్రోహి యిట్లనియె - (6 ఆశ్వా. 31 వచనము-)" అని కలదు. ఇక్కడ 'దోహరి' యనఁగా మాల (దాసరి), చండాలుఁడు - వెలివాడ వాఁడే. అచ్చు